ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సిరివెన్నెల గారి కలం నుండి రాలిన నిప్పు రవ్వ అనాలో, నీటి చుక్క అనాలో మనమే నిర్ణయించుకోవాలి.
పధాలలో గాంబీర్యం, భావలలో మాధుర్యం.
ఈ పాటలో ఆద్యంతం
పొంతనలేని వక్తీత్వాలు స్నేహం చేయబోతున్నాయి అని చెప్పడం జరిగింది
ఆ పొంతన లేని వ్యక్తిత్వాలను వివిద పరిస్తితుల దగ్గర పుట్టే నిప్పు, నీరులతో పోల్చారు.
ఆ తరవాత ఆ స్నేహం వల్ల కలిగే పరిణామాలను ప్రశ్నార్దకంగా మిగిల్చారు.
Dosthi Telugu Song Lyrics Break Down
పులికి, విలుకాడికి
తలకి, ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్ళకి
రవికి, మేఘానికి
దోస్తీ..
పులికి.. వేటగాడికి దోస్తీ
తలకి.. ఉరితాడుకి దోస్తీ
కార్చిచ్చు.. వడగళ్ల వానకి దోస్తీ
సూర్యుడికి, మేఘానికి దోస్తీ
అలాంటి రెండు భిన్న వ్యక్తిత్వాలకి
దోస్తీ ఏర్పడింది…
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో..
తీస్తుందో..
ఈ దోస్తీ వల్ల.. ఇది వరకు చుడని పరిణామం
ఎదురు కాబోతోంది..
ఈ పరిస్థితి వల్ల.. ఒకరి ఒకరు ప్రాణం ఇచ్చుకుంటారా…?
ఒకరి ప్రాణం ఇంకొక్కరు తీసుకుంటారా?
బడబాగ్నికి, జడివాన కి దోస్తీ…
విధిరాత కి ఎదురీత కి దోస్తీ…
పెనుజ్వాల కి హిమనగమిచ్చిన
కౌగిలి ఈ దోస్తీ…
బడబాగ్ని: ఈ అగ్ని, సముద్రం లో ఉంటుంది.. సముద్రం నుండి ఉద్భవిస్తుంది..అగ్ని పర్వతం అనుకోవచ్చు.
సముద్రం లో పుట్టే బడబాగ్ని కి, మేఘాల రాపిడి (మెరుపు కూడా అగ్నికి ప్రతిరూపమే) వల్ల వచ్చే జడివాన కి దోస్తీ కుదరబోతోంది..
విధిరాత ని ఎవరు మార్చలేరు అంటారు..
కానీ ఆ విధిరాత ఎదురు వెళ్ళాలి అనే ప్రయత్నానికి,
విధిరాతకి దోస్తీ కుదరబోతోంది..
పెను జ్వాల (పెద్ద మంట) కి హిమనగం (హిమాలయాల కొండ) ఇచ్చిన కౌగిలి లాంటి దోస్తీ.. ఇది..
అనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగా
వైరమే కూరిమై?
ఒక ‘గాలి’ దుమారం వల్ల. ‘అగ్ని’, ‘జలం’ లాంటి ఇద్దరు కలిశారు..
వాళ్ళ వైరం (శత్రుత్వం) కురిమిగా (స్నేహంగా) మారుతుందా ఈ కారణం వల్ల.
నడిచేది ఒకటే దారే…
వెతికేది మాత్రం వేరే…
తెగిపోదా ఏదో క్షణాన
స్నేహమే ద్రోహమై..
వాళ్ళు కలిసి ఒక దారిలో నడుస్తున్నారు..
కానీ ఇద్దరి గమ్యం వేరే..
ఈ గమ్యాల వల్ల.. వీళ్ళ స్నేహం ద్రోహం గా మారదు కదా..?
తొందర పడి పడి ఉరకలెత్తే
ఉప్పెన పరుగులహో
ముందుగ తెలియదు ఎదురువచ్చే
తప్పని మలుపులేవో…
ఎందుకంటే.. తొందర పది పరుగులు తీసే ఉప్పెన వేగానికి..
ముందు వచ్చే మలుపేంటో తెలీదు..
ఆ మలుపుగా అగ్ని జ్వాలా ఎదురవుతే..
జరిగే పరిణామం ఊహించలేం..
ఒక చెయ్యి రక్షణ కోసం.
ఒక చెయ్యి మృత్యు విలాసం
బిగిసాయి ఒకటై ఇలాగా తూరుపు పడమర
ఒకరి చెయ్యి, రక్షణ కోసం చాస్తే(Defense).. ఒకరి చెయ్యి మృత్యువుని కోరేది(Attack)..
అలాంటి తూర్పు పడమర లాంటి రెండు భిన్న మార్గాల్లో నడిచే చేతులు ఒక కార్యం కోసం కలిసాయి..
ఒకరేమో దారుణ శస్త్రం
ఒకరేమో మారణ శాస్త్రం
తెర తొలగిపోతే
ప్రచండ యుద్ధమే జరగదా?
ఒకరెమో శస్త్ర విద్యలో ప్రావీణ్యులు..
ఒకరేమో మారణ శాస్త్రాన్ని సృష్టించే వాళ్ళు..
ఇద్దరి మధ్య తెర తొలగిపోతే.. యుద్ధం జరగకుండా ఉంటుందా?
తప్పని సరి అని తరుణమొస్తే
జరిగే జగడములో
ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో…
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో..
తీస్తుందో…?
ఇద్దరి మధ్య అనుకోని పరిస్థితి ఏమొచ్చిన యుద్ధం జరిగే తీరుతుంది.. అలాంటి యుద్ధం జరిగితే…
గెలుపు ఎవరిదీ ఓటమి ఎవరిది. తేల్చేవారెవరు..? ఇది చిత్రమే కదా..
ఇలాంటి చిత్రమైన పరిస్థితుల్లో స్నేహం కోసం చాచిన హస్తం.. ప్రాణం ఇస్తుందా తీస్తోందా?