ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆఆ… ముద్దుల మువ్వరావు గారి పెద్దమ్మాయి
పద్దెనిమిదవ ఏట పైటేసుకుందంట డియ్యాలో డియ్యాల…
చిన్నవీధి సక్కెల చిట్టెమ్మగారి చిన్నకోడలు
నలభైవ ఏట నీళ్ళోసుకుందంట డియ్యాలో డియ్యాల…
రంగుల రాజారావు గారి మూడో అమ్మాయి
పక్కింటి పుల్లారావు గారి నాల్గో అబ్బాయితో
జంపు జిలానీ అంటా డియ్యాలో డియ్యాల…
ఇంకా మన మెరికింటి మంగతాయారు, గాజుల సిట్టెమ్మ
దుబాయ్ సత్యవతి, ఆల్లాల్ల మొగుల్ని వదిలేసారంటా డియ్యాలో డియ్యాల…
ఆళ్ళ కథలు మాత్రం నేను సెప్పలేను గానీ
ఆళ్ళ నోటితో ఆళ్ళే సెప్పుకుంటారంటా డియ్యాలో డియ్యాల…
మొదలెట్టవే మంగతాయారు..!!
అద్దరూపాయి ఇచ్చాడు… అద్దం కొనుక్కోమన్నాడు
డియ్యాలో డియ్యాల… డియ్యా డియ్యా డియ్యాల
ఒక్కరుపాయిచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు…
డియ్యాలో డియ్యాల… డియ్యా డియ్యా డియ్యాల
రెండు రుపాయిలిచ్చాడు రిబ్బెను కొనుక్కోమన్నాడు
డియ్యాలో డియ్యాల…
మూడు రుపాయలిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు
డియ్యాలో డియ్యాల…
పది రుపాయలిచ్చి పాండ్స్ పౌడరు కొనుక్కోమన్నాడు
నలభై రుపాయలిచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు
అన్నీ కొనిచ్చీ అలంకరించీ… ఐదు లక్షలకు బేరంపెట్టీ
ఆసలేని పసలేని… ముసలోడికి నన్నమ్మేసాడో
పిల్లా నీ బావనిస్తవా… తోలుకొల్లి తెల్లారి తీసుకొస్తను
ఏలో డియ్యాలో…
పిల్లా నీ బావనిస్తావా ఏడి కాస్తా చల్లారబెట్టుకొస్తను
ఏలో డియ్యాలో…
అమ్మో నా బావనిస్తనా… జూనియర్ షారుక్ ని జారనిస్తనా
అమ్మో నా బావనిస్తనా… ఇంకో కాజోల్ ని చావనిస్తనా…
మేనకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది
గాజుల సిట్టెమ్మ మీముందుకు గలగల వచ్చేస్తుందోయ్…
గజ్జెల సప్పుడు విన్నడా… ఎక్కడికెల్లావంటాడు
డియ్యాలో డియ్యాల… డియ్యా డియ్యా డియ్యాల
గాజుల ఊపుడు విన్నాడా… ఎవడికి సైగలు అంటాడు
డియ్యాలో డియ్యాల… డియ్యా డియ్యా డియ్యాల
పక్కింటోడికి పొలమారిందా… నువ్వే తలిసావంటాడు
డియ్యాలో డియ్యాల…
పొరిగింటోడికి జ్వరం వచ్చిందా… నీపై దిగులని అంటాడు
డియ్యాలో డియ్యాల…
దోమకుట్టిందన్నానా… ఆడా మగా అంటాడు…
పోని..! సీమ కుట్టిందన్నానా… చిన్నా పెద్దా అంటాడు..!!
వాడికి వీడికి లింకులు పెట్టి… ఉన్నవి లేనివి రంకులు కట్టి
శీలానికి సంకెళ్ళేసే చిలకే కొట్టని జామపండయ్యాను
అయ్యో పాపం..!!
పిల్లా నీ బావనిస్తవా… ఒక్కసారి సాటుకెళ్లి లేటుగొస్తాను
ఏలో డియ్యాలో…
పిల్లా నీ బావనిస్తవా… నా మొగుడుకున్న డౌటులన్ని రైటు చేస్తను
ఏలో డియ్యాలో…
అమ్మో నా బావనిస్తనా… అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తనా
అమ్మో నా బావనిస్తనా… వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తనా
అరే..!! జరగండి జరగండి జరగండి… జర దూసుకుంటూ
వచ్చేత్తంది దుబాయ్ సత్యవతే..!!!
దుడ్డు కావాలన్నడో… దుబాయ్ నన్ను పంపాడో
డియ్యాలో డియ్యాల… డియ్యా డియ్యా డియ్యాల
ఫ్రిడ్జ్ టీవీ కొంటానే… పైసల్ పంపియ్మన్నాడు
డియ్యాలో డియ్యాల… డియ్యా డియ్యా డియ్యాల
సోఫా సెట్ కొంటానే… సొమ్ములు పంపిమన్నాడు
డియ్యాలో డియ్యాల…
డబల్ కాట్ కొంటానే… డబ్బులు పంపియ్మన్నాడు
డియ్యాలో డియ్యాల…
ఇయన్ని పెట్టాలంటే… ఇల్లు కావాలన్నాడు
ఈస్ట్ ఫేసులో కొంటానే… ఇంకా పంపియ్మన్నాడు
సాలిడ్గా సెటిలయ్యామంటూ… బోలెడు ఆశతో ఫ్లయిటే దిగితే
ఈస్ట్ ఫేస్ ఇంటిలోన… డబల్ కాట్ బెడ్ పైన
సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను…
తుస్..!!
పిల్లా నీ బావనిస్తవా… అప్సెట్ సెట్ చేసుకొని తీసుకోస్తను
ఏలో డియ్యాలో…
పిల్లా నీ బావనిస్తవా… దుబాయ్ సెంట్ బుడ్డిలోన ముంచుకొస్తను
ఏలో డియ్యాలో…
అరె..! అమ్మో నా బావనిస్తనా… ఆయిల్ బావిలోన దుకానిస్తనా
అమ్మో నా బావనిస్తనా… వీడి చెట్టు నీకు అంటనిస్తనా
ఓర్ఓర్ఓర్ ఓరి..!! ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసుగాని
ఇదెవరో కొత్తబండిరా బాబు… రైమంటూ గుద్దుకుంటూ వచ్చేత్తాంది
ఇలియానాకే ఈర్షపుట్టే… నడుమే నాదని అన్నాడు
డియ్యాలో డియ్యాల…
ముమైత్ఖాన్కి ధమాక్ తిరిగే… ఉడుకె నాదని అన్నాడు
డియ్యాలో డియ్యాల…
శ్రేయకే సెమటలుపుట్టే… సోకే నాదాని అన్నాడు
డియ్యాలో డియ్యాల…
అనుష్కనే ఎనక్కి నెట్టే… సరుకే నాదని అన్నాడు
డియ్యాలో డియ్యాల…
ఫ్రంట్ బ్యాక్ చూసాడు… మెంటలెక్కి పోయాడు
అప్ డౌన్ చూసాడు… అప్పడం అయ్పోయాడు
పేస్ చూసి… ఆ..!! పేస్ సూసి
హే… పేస్ చూసి ఫ్రీజయిపోయి… పార్టులు మొత్తం లుసైపోయి
పాపకి నేను సరిపోనంటు పారిపోయాడు..!!!
అబ్బో..!! అంత గొప్ప ఫేసా… జరమాక్కూడా సూపించరాదే
పిల్లా నీ బావనిస్తవా… కంటి సూపుతోనే సప్పరిస్తాను
ఏలో డియ్యాలో…
హే… పిల్లా నీ బావనిస్తవా… నోటిమాటతోనే నంజుకుంటాను
ఏలో డియ్యాలో…
ఓకే..! నా బావనిస్తను… జూనియర్ షార్కుని జంటచేస్తను
నీకే నా బావనిస్తను… ఇంత అందగత్తె గాడు లేదంటను
పిల్లా నీ బావనివ్వవు… నమ్ముకున్న తోడునెప్పుడు వీడనివ్వవు
ఏలో డియ్యాలో…
పిల్లా నీ బావనివ్వవు… జీవితాన్ని మోడులాగా మారానివ్వకు
ఏలో డియ్యాలో…