ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Director Krish Second Marriage: డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ల క్రితం ఒక డాక్టర్‌ని వివాహం చేసుకున్న క్రిష్.. రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. తాజాగా మరో డాక్టర్‌ని క్రిష్ పెళ్లి చేసుకోవడం గమనార్హం.
హైదరాబాద్‌లో సోమవారం (నవంబర్ 11)న డాక్టర్ ప్రీతి చల్లాని క్రిష్ వివాహం చేసుకున్నారు. ఈ మేరకు వివాహ విషయాన్ని సోషల్ మీడియాలో క్రిష్ అధికారికంగా ప్రకటించారు.
ఎవరు ఈ ప్రీతి చల్లా?
గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రీతి 2007 నుంచి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ను ఆమె పూర్తి చేశారు. అక్కడే గైనకాలజీలో ఎంఎస్ కూడా పూర్తి చేశారు.
గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన కుటుంబ వ్యాపారమైన చల్లా ఆసుపత్రినిలో వైద్యురాలిగా చేరి సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా క్రిష్ ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ.. వధువు వివరాల్ని మాత్రం క్రిష్ గోప్యంగా ఉంచారు.
క్రిష్‌కి రెండో వివాహం: వాస్తవానికి డైరెక్టర్ క్రిష్‌కి ఇది రెండో వివాహం. గతంలో రమ్య వెలగ అనే డాక్టర్‌ను అతను వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్లకే ఈ ఇద్దరూ విడిపోయారు. రమ్యని 2016లో హైదరాబాద్‌లో క్రిష్ వివాహం చేసుకోగా.. భేదాభిప్రాయాలతో 2018లో వాళ్లు విడిపోయారు.
క్రిష్ ప్రస్తుతం కెరీర్‌లోనూ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో హరి హర వీరమల్లు సినిమా నుంచి అనూహ్యంగా క్రిష్ తప్పుకున్నారు. అయితే.. సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో ఘాటీ సినిమాను దాదాపు క్రిష్ పూర్తి చేసేశారు. గత వారం విడుదలైన ఘాటీ టీజర్.. అందర్నీ కట్టిపడేసింది.