Dangers of Drinking Too Much Alcohol
మనం తాగే ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుంది?
మద్యం తాగిన తర్వాత అది నేరుగా పొట్టలోకి వెళ్లి మూత్రం రూపంలో శరీరాన్ని వదిలి వెళుతుందని చాలా మంది భావిస్తారు. అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు.
“ఎంత తాగుతున్నారు? ఎప్పుడు తాగుతున్నారు? ఎంత కాలం నుంచి తాగుతున్నారు? అన్న విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం. దీని వల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది”. “ఆల్కహాల్ తాగిన తర్వాత అది పొట్టలోని చిన్న పేగులోకి వెళుతుంది. అక్కడ అది అల్డిహైడ్స్ అనే రసాయనంగా విడిపోతుంది” అని ఆయన చెప్పారు.
“పొట్ట, పేగుల్లోని రక్తం లివర్ ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంది. కాలేయం మనం తిన్న ఆహారంలో పోషకాలను వేరు చేసి రక్తంలో కలిపి, ఆ రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. అలాగే ఆహారంలో పనికిరాని వాటిని వేరు చేసి మలం, మూత్రం రూపాల్లో బయటకు పంపిస్తుంది”
“అల్డిహైడ్ చాలా ప్రమాదకరమైనది. ఇది రక్తం ద్వారా కాలేయానికి చేరుకుని కాలేయాన్ని దెబ్బ తీస్తుంది. అందుకే మీరు తక్కువ కాలంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే శరీరంలో అల్డిహైడ్ల పరిమాణం పెరుగుతుంది. దీంతో కాలేయం పని చేయడం ఆపేస్తుంది”.
ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే కాలేయ వ్యాధులు ఏంటి?
మద్యపానం వల్ల కాలేయానికి అనేక సమస్యలు వస్తాయి. గత దశాబ్ధంలో దేశవ్యాప్తంగా కాలేయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరికి కాలేయ సంబంధ వ్యాధి ఉంది. కాలేయ వ్యాధుల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.
మద్యపానం వల్ల ప్రధాన సమస్య లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలోని కణాల్లో వాపు పెరుగుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఇదిలాగే కొనసాగితే కాలేయం పని చేయడం నెమ్మదిగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి కోల్పోవడం, కండరాల బలహీనత, డీ హైడ్రేషన్, కామెర్లు, వాంతుల్లో రక్తం పడటం లాంటివి లివర్ సిరోసిస్ లక్షణాలు.
What is Rave Party in Telugu – అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ
ఆల్కహాల్ తాగడం వల్ల హెపటైటిస్ లేదా లివర్ ఫెయిల్యూర్
సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగేవారిలో ఈ సమస్య తలెత్తుతుంది. కామెర్లు, రక్తం గడ్డకట్టడంతో పాటు మెదడులోని కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
‘‘మీరు ఎంత మద్యం తాగుతున్నారని కాదు, మద్యపానం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బ తింటుంది, కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా కాలేయం పని చేయడం మానేస్తుంది’’.
ఆల్కహాల్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందా?
గతేడాది ఎయిమ్స్ ప్రచురించిన ఓ అధ్యయన పత్రం ప్రకారం, 38 శాతం మంది భారతీయులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉందని తేలింది. లివర్ కణాలలో కొవ్వు సహజంగానే ఉంటుంది. అయితే ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉంటుంది.
లివర్ కణాలలో ఉండే కొవ్వు 20-25 శాతం దాటితే అది కాలేయం పని తీరుని దెబ్బ తీస్తుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అని పిలుస్తున్నారు. ఫ్యాటీ లివర్‌లో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని రెండు రకాలు వుంటాయి. రోజువారీ జీవితంలో మార్పులు, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం లాంటి అంశాలు ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది సాధారణ అంశం.
రోజుకు ఎంత ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం?
కొంతమంది ఎంత మద్యం తాగినా నియంత్రణ కోల్పోకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే రోజూ కొద్ది మొత్తంలో ఆల్కహాల్‌ను తీసుకోవడం మంచిదేనని వైద్యులు చెబుతున్నారు.“రోజుకు 30 ఎంఎల్ ఆల్కహాల్ తీసుకోవడం సురక్షితం. రోజూ అంత మొత్తంలో తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా తాగాలన్నా మీ కాలేయడం జన్యుపరంగా ఆరోగ్యంగా ఉండాలి. లివర్‌కు సంబంధించి ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉండకూడదు”.
అదే సమయంలో మద్యానికి బానిసలుగా మారితే, ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా కొద్ది మొత్తంతో సరిపెట్టడం సాధ్యం కాదు. మద్యం తాగడం అలవాటుగా మారితే తాగే పరిమాణం రోజురోజుకీ పెరుగుతుందే తప్ప, తగ్గదు. అందుకే ఆల్కహాల్‌ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
మనం మంచి నీళ్ళు ఎప్పుడు, ఎంత, ఏ విధముగా త్రాగాలి – Importance of water in Telugu?
మద్యం మానేస్తే కాలేయం మెరుగుపడుతుందా?
కొన్ని సార్లు చాలా కాలంగా మద్యం సేవిస్తున్నవారు మానేయాలని నిర్ణయించుకుంటారు. దీని వల్ల అనారోగ్యం నుంచి బయటపడొచ్చని అనుకుంటారు. అయితే దీర్ఘకాలం మద్యానికి బానిసలైనవారు హఠాత్తుగా దాన్ని మానేసినా కాలేయ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోలేరని వైద్యులు చెబుతున్నారు.
ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లేదా ఫైబ్రోసిస్ తొలి దశలో మద్యం తాగడం మానేస్తే, కాలేయం మరింత దెబ్బ తినకుండా ఆపవచ్చు. “ఏదేమైనప్పటికీ, లివర్ సిరోసిస్ వస్తే, ఆల్కహాల్ తాగడం పూర్తిగా మానేసినా, దాన్నుంచి కోలుకోవడం సాధ్యం కాదు. లివర్ సిరోసిస్‌కు వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సిందే.
అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. లివర్ డ్యామేజ్ ఏ దశలో ఉన్నా, మద్యం తాగడం ఆపేస్తే కాలేయానికి అదనపు నష్టం జరగడం ఆగిపోతుంది.
ఆల్కహాల్ తాగడం వల్ల ఎటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి?
మద్యపానం వల్ల దెబ్బ తినే మరో అవయవం మెదడు. అందుకే మద్యం అలవాటు ఉన్న వారు మానసికంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒక వ్యక్తి ఎంత మద్యం తీసుకుంటున్నారు? ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఆ వ్యక్తిలో ఎంత ఆల్కహాల్‌ను భరించే సామర్థ్యం ఉంది అనే దానిపై మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
మద్యం అధికంగా తాగితే వచ్చే సమస్యలు ఏంటి – Dangers of Drinking Too Much Alcohol?
కొంతమంది తక్కువగానే తాగినా, ఆల్కహాల్‌కు పూర్తిగా అలవాటు పడకపోయినా లేదా బానిసలుగా మారినా వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాళ్లు వస్తువులను పగలగొడుతుంటారు.
“ఇందులో తర్వాతి దశ డెలిరియం ట్రెమెన్స్. ఇందులో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పెద్దగా అరవడం, పోలీసులు వచ్చి తమను అరెస్ట్ చేస్తారని చెప్పడం లాంటివి ఉంటాయి. దీంతో పాటు బ్రాంతి, మానసిక అనారోగ్య లక్షణాలైన నిద్రలేమి, అయోమయం, మతిమరుపు, అలసట, చెవిలో ఏదో శబ్ధాలు వచ్చినట్లు అనిపిస్తుంది”.
ఆల్కహాల్ మానేసిన తర్వాత ఏమవుతుంది ?
మద్యం తాగడం వల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావం పడుతుంది. అయితే తాగడం మానేసిన తర్వాత కొంతమందిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. మద్యం హఠాత్తుగా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్, ప్రకంపనలు, అలసట కనిపిస్తాయి.
“కొంతమంది మద్యం తాగడం మానేసిన తర్వాత వారికి చెవుల్లో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపిస్తుంటాయి. ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. దీన్నే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు.
ఏళ్ల తరబడి మద్యం తాగుతూ ఏదో ఒక కారణంతో హఠాత్తుగా మద్యం మానేసినవారిలో మూడు రోజుల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయి. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి జారి పోతారు.
ఆల్కహాల్ తాగడం వల్ల కలిగే న్యూరోలాజికల్ సమస్యలు:
మద్యం మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు తీవ్రమైతే తర్వాతి దశలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారి తీస్తుంది. దీన్ని వెర్నికే ఎన్సెఫలోపతి కోర్షాఫ్ అంటారు. ఈ దశలో అన్నింటినీ మర్చిపోతుంటారు. ఇదెలా ఉంటుందంటే అకస్మాత్తుగా వారు ఒక ప్రశ్న అడిగి, దానికి సమాధానం చెప్పేలోపే తాము ప్రశ్న అడిగిన విషయాన్ని మర్చిపోతుంటారు.
తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. మియోపతి, న్యూరోపతికి సంబంధించిన సమస్యల వల్ల నిలబడటం, పని చెయ్యడం అసాధ్యంగా మారుతుంది. అలాగే శరీరంపై సూదులు, పిన్నులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది.
మనిషి మద్యానికి ఎందుకు బానిసగా మారుతాడు అసలు కారణం ఏంటి – Why Is Alcohol So Addictive in Telugu
లండన్ కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. ఆర్ఎఎస్జిఆర్ఎఫ్ -2 అనే జన్యువు ప్రజల మద్యపాన ఆనందాన్ని ప్రభావితం చేస్తుందని.. దీనిని వ్యసనంలా మారుస్తుందని తెలిపారు.
ఈ పరిశోధన జన్యుశాస్త్రం, మెదడు రసాయనశాస్త్రం మరియు ఆల్కాహాల్ తో మన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది.
ఈ అధ్యయనంలో డోపామైన్ ను హైలెట్ చేశారు. డోపామైన్ అనేది నాడీ వ్యవస్థ, మెదడులోని ఆనందంతో సంబంధం ఉన్న న్యూరోట్రాన్స్మిటర్. రుచికరమైన ఆహారం, ఇష్టమైన సంగీతం వినప్పుడు.. డోపామైన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఉపశమన భావనకు దారితీస్తుంది. ఆనందాన్ని కలిగించే పనులు చేసే అలవాటును పెంచుతుంది.
అదనంగా, ఆర్ఎఎస్జిఆర్ఎఫ్ -2 జన్యువు ఆల్కాహాల్ తాగినప్పుడు డోపామైన్ విడుదలయ్యే విధానానికి సంబంధించినదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ జన్యువు ఉన్నవారికి మద్యం తాగిన తర్వాత అధిక స్థాయిలో డోపామైన్ ఉండవచ్చని పరిశోధనలు చెపుతున్నాయి.
ఒక వ్యక్తి మద్యం తాగడం ద్వారా సంతోషంగా ఉండేలా డొపామైన్ పనిచేస్తుంది. ఇది ఒక వ్యక్తి నిరంతరం తాగాలని కోరుకునేలా చేస్తుంది.. దీంతో సదరు వ్యక్తి మద్యానికి బానసగా మారుతాడు.
Q/A
What happens if you suddenly stop drinking alcohol?
You may experience withdrawal symptoms such as anxiety, tremors, and nausea, but overall health improves over time.
Does alcohol cause fatty liver?
Yes, excessive alcohol consumption can lead to fatty liver disease, where fat builds up in the liver cells.
Hepatitis or liver failure (acute alcoholic hepatitis)?
Acute alcoholic hepatitis is a serious liver condition caused by heavy drinking, which can lead to liver failure if not managed.
What liver diseases are caused by alcohol consumption?
Alcohol can cause fatty liver, alcoholic hepatitis, and cirrhosis.
Where does the alcohol we drink go?
Alcohol is absorbed into the bloodstream, processed by the liver, and eventually excreted through urine and breath.
How much alcohol is safe to consume daily?
For most adults, moderate drinking is defined as up to one drink per day for women and up to two drinks per day for men.
Does the liver improve after quitting alcohol?
Yes, the liver can heal and recover, especially if damage is not severe and abstinence is maintained.
What are the mental health issues caused by alcohol?
Alcohol can contribute to anxiety, depression, and other mental health disorders.
What problems are caused by excessive drinking?
Excessive drinking can lead to liver disease, heart problems, digestive issues, and increased risk of accidents.
What happens after quitting alcohol?
You may experience withdrawal symptoms initially, but health improvements, such as better liver function and mental clarity, will follow.
What is Wernicke’s Encephalopathy and Korsakoff Syndrome?
Wernicke’s Encephalopathy and Korsakoff Syndrome are brain disorders caused by thiamine deficiency related to chronic alcohol abuse.
Are there benefits to detox centers and rehabilitation centers?
Yes, these centers offer medical support, therapy, and structured programs to help individuals recover from alcohol addiction.
Effects of Alcohol on Body
Dangers of Drinking Too Much Alcohol
How Alcohol Affects Your Health
Alcohol Impact on Liver and Mental Health
Health Risks of Excessive Alcohol Consumption
Understanding Alcohol Withdrawal Symptoms
Long-Term Effects of Heavy Drinking
Alcohol Detoxification Process
Alcohol Abuse: Signs and Risks
Recovering from Alcohol Addiction
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.