Menu Close

Cyber Crimes: మీ దగ్గరుండే పనికిరాని ఫోన్లను అమ్మటం, పడేయటం ఎంత డేంజరో చూడండి.

మీ దగ్గరుండే పనికిరాని ఫోన్లను పడేయటం ఇష్టం లేక పదికో పరకకో మొబైల్ షాపు వాళ్లకో వేరే ఎవరికైనా అమ్మేస్తున్నారా..? కానీ.. అలా అమ్మటం డేంజర్ అన్న విషయం. ఈ ముఠా గురించి తెలిస్తే అర్థమవుతోంది.

dont sell or throw you old phones

పాత మొబైల్ ఫోన్లు కొంటున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర ఏకంగా.. 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జనాల దగ్గర చవకగా కొన్న ఈ పాత మొబైల్ ఫోన్లను.. సైబర్ నేరగాళ్లు సైబర్ క్రైంలు చేసేందుకు వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు ఇచ్చి.. లేదా ప్లాస్టిక్ సామాన్లు, చక్కెర, ఉల్లిగడ్డలు లాంటివి ఇచ్చి కొనేస్తున్నారు. వాటిని సైబర్ క్రైం చేసే వాళ్లకు అమ్మేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గోదావరి ఖని పోలీసులు.. అలాంటి వారిపై నిఘా పెట్టారు.

ఈ క్రమంలోనే.. గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటున్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నివాసాల్లో తనిఖీలు చేయగా.. 3 గోనే సంచుల్లో 4 వేల మొబైల్ ఫోన్లు దొరికాయి. బీహార్‌కి చెందిన మహమ్మద్ షమీ, అబ్దుల్ సలాం, మహమ్మద్ ఇఫ్తికర్‌ని గోదావరి ఖని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ముఠా తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాన మొబైల్ ఫోన్లు కొని బీహార్ మీదుగా.. జామ్ తారా, దేవ్ ఘర్, జార్ఖండ్ తరలిస్తోంది. సైబర్ నేరగాళ్లకు అమ్మే ముందు.. మొబైల్ ఫోన్లలో సాప్ట్ వేర్ మార్చడం, ఇతర విడిభాగాలు మార్చి.. ఫోన్ పనిచేసేలా చేస్తున్నారు. అనంతరం అందులో ఉన్న డేటాను సైబర్ నేరగాళ్ల చేతికి అందజేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే.. గుర్తుతెలియని వ్యక్తులకు పాత ఫోన్లను అమ్మొద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు.

దయచేసి ఈ పోస్ట్ ని వెంటనే మీ వాళ్ళందరికీ షేర్ చెయ్యండి.

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading