హిందూ సంస్కృతిలో ఆవుకున్న ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలుసు, ఆవుని ధైవంగా బావిస్తాం. మనమేమో మూర్ఖత్వం అని పట్టించుకోని విషియాలను విదేశీలు ఒక్కొక్కటిగా అలవాటు చేసుకుంటున్నారు.. ఆవుని కౌగిలించుకోవడానికి గంటకి 200 $ పే చేస్తున్నారు – Cow Cuddling
కొవిడ్ -19 మహమ్మారి సమయంలో చాలా మంది అమెరికన్లు ఆవు కౌగిలింతల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ఆవు కడ్లింగ్’ అనేది జంతు చికిత్స పద్ధతి. పాశ్చాత్య దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. గంటకు 75 $ నుంచి 200 మధ్య చెల్లిస్తున్నారు.
కొన్ని ప్రదేశాలలో ఆవు కడ్లింగ్ సెషన్లు జూలై వరకు ముందుగానే బుక్ చేయబడుతున్నాయి. అరిజోనాలో ఐదు ఎకరాలలో ఉన్న ఐమీస్ ఫార్మ్ యానిమల్ సంక్చురి, యునైటెడ్ స్టేట్స్ లోని అగ్ర జంతు అభయారణ్యాలలో ఒకటిగా గుర్తింపు సాధించింది.
ఇక్కడ ఆవు కౌగిలింత పర్యటనలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది ఏం చెబుతున్నారంటే.. “మా ఆవులను కౌగిలించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారు. ఆవులు మీ కళ్ళకు ఆనందపు క్షణాలను, మీ హృదయంలో ఒక వెచ్చదనాన్ని కలిగిస్తాయి.
అనేక వ్యాధులను నయం చేస్తాయి” అని చెప్పారు. ఆవు కడ్లింగ్ శ్వాసకోశ వ్యాధులు, రక్తపోటు, వెన్నెముక నొప్పి, గుండె సమస్యలను మాత్రమే కాకుండా, విచారం, ఆందోళన, అన్ని రకాల ఉద్రిక్తతలను కూడా నయం చేస్తుంది. ఆవు కడ్లింగ్ ఆరోగ్యకరమైన మనస్సును నిర్ధారిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
తల్లి-ఆవు హృదయ స్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దాని వద్ద ప్రశాంతత లభిస్తుంది. ఈ పద్ధతిని ‘ఆవు-కమ్యూనికేషన్’ లేదా ‘ఆవు తల్లితో కమ్యూనికేషన్’ అని పిలుస్తారు. ఎవ్వరైనా తన తల్లి ఒడిలో పడుకున్నప్పుడు వారి సమస్యలన్నీ మరచిపోతారు.
అదేవిధంగా, ఆవు తల్లిని కౌగిలించుకున్నప్పుడు కూడా తన చింతలను మరచిపోతారు. ఒక ఎన్జీవో సంస్థ ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ సహా అనేక దేశాలలో ఆవు కడ్లింగ్ చాలా వేగంగా విస్తరిస్తుంది. గంటకు ఇండియన్ కరెన్సీలో 14 వేలు చెల్లించి ఆవు కౌగిలి పొందుతున్నారు.
దయచేసి షేర్ చెయ్యండి
ఆవుని కౌగిలించుకోవడానికి గంటకి 200 $ – Cow Cuddling – Importance of Cow in Telugu – Cow Devine Nature
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.