Menu Close

Chocolate Day Quotes in Telugu – చాక్లెట్ డే

Chocolate Day Quotes in Telugu – చాక్లెట్ డే

Chocolate Day Quotes in Telugu

డబ్బుతో ఆనందాన్ని కొనలేము అంటారు..
కానీ నేను చాక్లెట్ కొంటాను.
చాక్లెట్ నాకో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
హ్యాపీ చాక్లెట్ డే

నిజమైన సంతోషం, నిజమైన ప్రేమలోనే దొరుకుతుంది.
ఆ నిజమైన ప్రేమకు ఈ చాక్లెట్ ప్రతిరూపంగా ఉంటుంది.
happy chocolate day

ఈ ప్రపంచంలో నన్ను సంతోషంగా ఉంచేవి రెండే రెండు,
ఒకటి నీ నవ్వు, రెండు ఈ చాక్లెట్.
happy chocolate day

అన్నిటికన్నా బెస్ట్ చాక్లెట్ ఇద్దామని,
ఊళ్ళో ఉన్న చాక్లెట్ షాప్స్ అన్నీ తిరిగాను,
కానీ నీకన్నా తీయనైన చాక్లెట్ మాత్రం కనపడలేదు.
happy chocolate day

నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పడం కష్టం,
ఈ చాక్లెట్ నీకు ఎంత తీపిని ఇస్తుందో తెలీదు కానీ,
అంతకన్నా ఎక్కువ అని మాత్రం చెప్పగలను.
happy chocolate day

ఒక చాక్లెట్ మరొక చాక్లెట్ ను తినడం ఎవరైనా చూశారో లేదో తెలీదు కానీ,
ఆ అదృష్టం నాకు దక్కేలా ఉంది.
happy chocolate day

Different Types of Chocolates

డార్క్ చాక్లెట్:
ఆరోగ్యం ప్రకారం చూస్తే, డార్క్ చాక్లెట్ బరువు తగ్గడానికి మంచిదిగా చెప్పబడుతుంది. అంతేకాకుండా నెలసరి సమయాలలో నొప్పిని తగ్గిస్తుంది. మానసిక సమస్యలతో డిప్రెషన్ బారిన పడేవారికి కూడా డార్క్ చాక్లెట్ ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ డార్క్ చాక్లెట్లలో కోకో ఎక్కువగా, పాలపదార్ధాలు తక్కువగా ఉంటాయి. క్రమంగా, ఇందులో ఉండే కోకో ఆధారంగా డార్క్ చాక్లెట్ రుచి మారుతుంది.

మిల్క్ చాక్లెట్:
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎఫ్ డీఏ మార్గదర్శకాల ప్రకారం, ఒక మిల్క్ చాక్లెట్‌లో కనీసం 10% చాక్లెట్ లిక్కర్, 3.39% బటర్‌ ఫాట్, 12% పాల పదార్థాలు ఉండాలి. మిల్క్ చాక్లెట్ల గురించి మాట్లాడితే, అందులో క్యాడ్‌బరీ ప్రస్తావన లేకుండా ఉండదు. క్యాడ్‌బరీ భారతదేశంలోని చాక్లెట్‌లకు దాదాపుగా పర్యాయపదంగా ఉంటుంది.

వైట్ చాక్లెట్:
చక్కెర, పాలు, కోకో, కోకో బట్టర్ నుండి ఈ వైట్ చాక్లెట్ తయారు చేస్తారు. వైట్ చాక్లెట్లు పూర్తి తెలుపు రంగులో కాకుండా, దంతపు రంగులో ఉంటాయి. ఈ చాక్లెట్లు, సాధారణ చాక్లెట్లకు భిన్నంగా వెనీలా ఫ్లేవర్ కలిగి ఉంటాయి.

సెమీ-స్వీట్ చాక్లెట్:
ముందు చెప్పినట్లు, సెమీ స్వీట్ చాక్లెట్ కూడా ఒక రకమైన డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్‌లో కోకో కేవలం 35% మాత్రమే ఉంటుంది. ఇది బిట్టర్ చాక్లెట్స్ కన్నా తీయగా ఉంటాయి. కావున ఈ చాక్లెట్ డే నాడు, మీ భాగస్వామికి మీరు ఏ రకం చాక్లెట్స్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే ఆలోచించండి.

Chocolate Day Quotes in Telugu – చాక్లెట్ డే, Chocolate Day Best Quotes, Chocolate Day Wishes in Telugu, Chocolate Day Greetings in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

South Indian Actress with Highest Remuneration Interesting Facts About Indian Flag in Telugu Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos