ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చెంగున చెంగున
నల్లని కనుల రంగుల వాన
చిరు చిరు నవ్వుల మువ్వలు
చిందులు చిందెను పెదవుల పైన
ఎర్రని సిగ్గుల మొగ్గలు
మగ్గెను బుగ్గలలోన
ముసిరిన తెరలు తొలిగి
వెలుగు కురిసె వెన్నెలతోన
మళ్ళీ పసిపాపై పోతున్నా, ఆ ఆ నా
తుళ్ళి తుళ్లింతలతో తెల్లాన
వెల్లే ప్రతి అడుగు నీవైపేనా
మళ్ళీ ప్రతి మలుపు నిను చూపేనా
ప్రాయమంత చేదేననుకున్నా, ఆ ఆ
ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా, ఆ ఆ
నాకు తగ్గ వరుడేడనుకున్నా, ఆ ఆ
అంతకంటే ఘనుడిని చూస్తున్నా, ఆ ఆ
నా ఇన్ని నాళ్ళ మౌనమంతా
పెదవంచు దాటుతుంటే
తరికిట తకధిమి నేడిక నాలోనా
ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది చెప్పగలమా
ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా
మేఘం నీది కడలి ఆవిరిదే కాదా
కురిసే వానై తిరిగి రాదా, ఆ ఆ
నాలో మెరిసే మెరుపు మరి నీదే కాదా
మళ్ళీ నిన్నే చేరమంటోందా
ప్రశ్నలు ఎన్నో
నా మనసు కాగితాలు
బదులిలా సులువుగా దొరికెను నీలోనా
ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది చెప్పగలమా
ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా