చెలియా చెలియా చెయ్ జారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
పడి లేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకే దాకా… ఆగదు నా కేక
చెలియా చెలియా… చెయ్ జారి వెళ్ళకే
సఖియా సఖియా… ఒంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
కదలికే తెలియని శిలని… కదిలించి ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన… చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా… పలకవా అనురాగమా
ఓడిపోకే ప్రాణమా వీడిపోకుమా..!!
అడుగడుగు తడబడుతు
నిను వెతికి వెతికి… కనులు అలిసిపోవాలా
చెలియా చెలియా… చెయ్ జారి వెళ్ళకే
సఖియా సఖియా… ఒంటరిని చెయ్యకే
నిలిచిపో సమయమా… తరమకే చెలిని ఇకనైనా
చెలిమితో సమరమా… ఇంతగా పంతమా
నిలవకే హృదయమా… పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా… అంత సందేహమా
వేరుచేసే కాలమా… చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా… దారి చూపుమా
విరహాలే కరిగేలా
జత కలిపి నడుపు… వలపు కథలు గెలిచేలా
చెలియా చెలియా చెయ్ జారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడి రేయి పగలు చూడక
సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
పడి లేచే కెరటం తీరుగా
దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకే దాకా… ఆగదు నా కేక