Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాడు. తరువాత పశ్చాత్తాపపడతాడు. అటువంటి పరిస్థితిలో అందరితో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం. అందుకని ప్రతి వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులతో వాదించకూడదని చెబుతున్నారు. వారెవరో తెలసుకుందాం..
ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. మూర్ఖుడు ఎవరి మాట వినడు. అతను తన మాట మాత్రమే మాట్లాడుతాడు. కనుక అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి. సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించాడు.
గురువు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి మోటివేట్ చేస్తాడు. గురువు లేకుండా.. మీరు జ్ఞానాన్ని కూడా పొందలేరు. అటువంటి పరిస్థితిలో మీరు గురువుతో వాదించకుండా ఉండటం ముఖ్యం. ఇది మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
ఇష్టమైనవారు జీవితంలో ముందుకు సాగడానికి ఒక వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారు. అందువల్ల, మీ ఇష్టమైన వారితో ఎప్పుడూ వాదించకండి. ఇది మీకు హాని కలిగించే అవకాశం ఉంది.
అలాగే మన సంతోషాలను భాదలను నిర్భయంగా చెప్పుకునే ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కడైనా ఉంటాడు. మన రహస్యాలు ఆ స్నేహితుడికి తెలుసు. అందుకే అలాంటి మంచి స్నేహితుడితో ఎప్పుడూ వాదించకండి. ఎందుకంటే అతనికి మీ పై వ్యతిరేకత ఏర్పడితే మీ సీక్రెట్స్ ని ఇతరులకు చెప్పే ప్రమాదం ఉంటుంది.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.