ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
భార్యభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం. అది కోల్పోతే బంధాలు నిలవడం కష్టం. ఇద్దరి మధ్య ఏ విషయంలో కూడా అబద్దాలు చేప్పుకోకూడదు. ఇద్దరూ నిజాయితీగా ఉండాలి. భార్యభర్తలు ఒకరికొకరు సర్దుకుపోతే అలాంటి కుటుంబంలో శాంతి, శ్రేయస్సు, ప్రేమలు ఉంటాయి.
భార్యభర్తలకు ఒకరిపై మరొకరికి గౌరవం, ప్రేమ లేకపోతే బంధం నిలబడదు. ఇద్దరూ ప్రేమించుకోవాలి కానీ ద్వేషించుకోకూడదు. భార్యభర్తలిద్దరూ కలిసి ఉండాలి కానీ అనవసర విషయాలను పట్టించుకుని అవమానించుకోకూడదు. అప్పుడే బంధం కలకాలం నిలుస్తుంది.
కోపం మనిషికి తన పక్కన ఎవరూ నిలబడకుండా చేస్తుంది. ప్రేమగా ఉంటే నలుగురు నీతో కలసి జీవిస్తారు. స్నేహం చేస్తారు. భార్య భర్తలు కూడా కోపాలకు పోతే బంధాలను కోల్పోతారు.
నిందలు వేసుకోవవడం మానుకోవాలి శాంతంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలి. అప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది. భార్యభర్తలు ఏదైనా సమస్య ఉంటే ఇద్దరే మాట్లాడుకుని పరిష్కరిచుకోవాలి. అన్ని విషయాలు ఇతరులకు చెప్పుకుని అభాసుపాలు కాకూడదు.
తమ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకుని బాధపడితే మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎగతాలి చేస్తారు. అందుకే భార్యభర్తలు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కలిసిమెలసి జీవించాలి. స్త్రీ, పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. వివాహంలో ఉండాల్సిన మొదటి సూత్రం ఇది. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది.
Chanakya Niti in Telugu – చాణిక్య నీతి