Chanakya Niti in Telugu – చాణిక్య నీతి
చాణక్య కష్టాలను ఎదుర్కోవడానికి ఏం చెప్పాడో తెలుసుకుందాం..
ముందుచూపు వుండాలి: ప్రతి ఒక్కరూ ముందుచూపు కలిగి వుండాలి. భవిష్యత్తులో అవకాశాలు, అవరోధాలు ఎదురవుతాయి, అవకాశాలని అందిపుచ్చుకోవాలి అలానే అవరోధాలను దాటుకుని ముందడుగు వెయ్యాలి. అలా జరగాలంటే ముందుచూపు తస్పనిసరి. లేదంటే అన్నివిధాలుగా నష్టపోతారు అని చెప్పాడు.
“చాణక్య నీతి సూత్రాలు – ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే గొప్ప పుస్తకం ఇది”
ఏకాగ్రత: మనసు స్థిరంగా లేనివారు ఒక మాట మీద నిలబడలేరు, స్పష్టంగా మాట్లాడలేరు.. ఏదో ఒకటి మాట్లాడుతూ నమ్మకం కోల్పోతారు. ఒంటరిగా మిగిలిపోతారు. మనసు స్థిరంగా ఉంటే అది ఏదైనా జరగనీయండి.. కానీ మనకంటూ ఓ గుర్తింపు ఉంటుంది. లేదంటే జీవితంలో స్థిరత్వం అంటూ లేకుండా పోతుంది.

భలమైన, ఆరోగ్యమైన దేహం: అలాగే శరీరాన్ని భలంగా, శుభ్రంగా ఉంచుకోవాలని చాణక్యుడు సూచించాడు. శరీరం భలంగా, శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలమని చెప్పాడు. ఇందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలని, మనం ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని తెలిపాడు.
ఏ పనైనా ఇష్టంగా చెయ్యాలి: ఏ పని చేసినా మనస్పూర్తిగా చేయాలని, నిండుమనసుతో చేస్తే ఎదైనా సాధించవచ్చని తన చాణక్య నీతిలో వివరించాడు. ఒక్క సారి సరైన నిర్ణయం తీసుకుంటే ఇక తడబడకుండా ముందుకు వెళ్లాలని సూచించాడు.
అబద్ధం చెప్పకూడదు: అబద్దాలు చెప్పే వ్యక్తులు కష్టాలపాలవుతారని చెప్పాడు. అబద్దాలు చెప్పకుంటూ పోతే జీవితమే ఒక అబద్దం అవుతుందిని.. మనకు ఎవరూ విలువ ఇవ్వరని తెలిపాడు. ఒక్క అబద్దం వంద అబద్దాలు ఆడేలా చేస్తుందని, అందుకే ఏదైనా సరే నిజమే మాట్లాడాలని సూచించాడు.