చల్లగాలి తాకుతున్న… మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న… జల్లు అయినదీ వయసిలా
ఎందుకంట ఇంత దగా… నిన్న మొన్న లేదు కదా (లేదు కదా)
ఉండి ఉండి నెమ్మదిగా… నన్ను ఎటో లాగుతుందా (లాగుతుందా)
గతమే తప్పించుకోలేనని… తోచేట్టు చేస్తున్నదా
చల్లగాలి తాకుతున్న… మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న… జల్లు అయినదీ వయసిలా
ఎవరో అన్నారని… మారవే నాలో ఆశలు
ఎవరేమన్నారని… పొంగెనే ఏవో ఊహలు
ఎవరో అన్నారని… మారవే నాలో ఆశలు
ఎవరేమన్నారని… పొంగెనే ఏవో ఊహలు
తీరం తెలిసాక… ఇంకో దారిని మార్చానా
దారులు సరి అయినా… వేరే తీరం చేరానా
నడకలు నావేనా… నడిచేది నేనెనా
చల్లగాలి తాకుతున్న… మేఘమైనదీ మనసిలా
నేలకేసి జారుతున్న… జల్లు అయినదీ వయసిలా
ఎంతగా వద్దంటున్నా… ఆగదే ఆత్రం ఏమిటో
ఇంతగా పొంగేటంతా… అవసరం ఏమో ఎందుకో
అయినా ఏమైనా… ఎద నా చేయి జారింది
ఎపుడూ ఏనాడు… ప్రేమే నేరం కాదంది
చెలిమే ఇంకోలా… చిగురిస్తు ఉందటే
చల్లగాలి తాకుతున్న… మేఘమైనదీ మనసిలా (మనసిలా)
నేలకేసి జారుతున్న… జల్లు అయినదీ వయసిలా (వయసిలా)
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.