ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chali Chaliga Allindi Song Lyrics in Telugu -Mr. Perfect – చలి చలిగా అల్లింది
చలి చలిగా అల్లింది… గిలి గిలిగా గిల్లింది…
నీ వైపే మళ్ళింది మనసు…
చిటపట చిందేస్తుంది… అటు ఇటు దూకేస్తుంది…
సతమతమైపోతుంది వయసు…
చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో… గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి…
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో… గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయి…
నువ్వు నాతోనే ఉన్నట్టు… నా నీడవైనట్టు…
నన్నే చూస్తున్నట్టు ఊహలు…
నువ్వు నా ఊపిరైనట్టు… నా లోపలున్నట్టు…
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలూ
చలి చలిగా అల్లింది… గిలి గిలిగా గిల్లింది…
నీ వైపే మళ్ళింది మనసు…
చిటపట చిందేస్తుంది… అటు ఇటు దూకేస్తుంది…
సతమతమైపోతుంది వయసు…
గొడవలతో మొదలై… తగువులతో బిగువై…
పెరిగిన పరిచయమే… నీది నాది..
తలపులు వేరైనా… కలవని తీరైనా… బలపడిపోతుందే ఉండేకొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు… ఆకాశంపైకే వెళుతున్నట్టు
తారలన్ని తారసపడిన్నట్టు… అనిపిస్తుందే నాకు ఏమైనట్టు
నువ్వు నాతోనే వున్నట్టు… నా నీడవైనట్టు…
నన్నే చూస్తున్నట్టు ఊహలు…
నువ్వు నా ఊపిరైనట్టు… నా లోపలున్నట్టు…
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలూ…
తర..రిర..రిర..రేరే… తర..రిర..రిర..రేరే…
తర రిరరి.. రేరే.. రేరే…రేరే
నీపై కోపాన్ని ఎందరి ముందైనా… బెదురే లేకుండా తెలిపే నేను..
నీపై ఇష్టాన్ని నేరుగ నీకైనా… తెలపాలనుకుంటే తడబడుతున్నాను…
నాకు నేనే దూరం అవుతున్నా… నీ అల్లరులన్నీ గురుతొస్తుంటే…
నన్ను నేనే చేరాలనుకున్నా… నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే..
నువ్వు నాతోనే వున్నట్టు… నా నీడవైనట్టు…
నన్నే చూస్తున్నట్టు ఊహలు…
నువ్వు నా ఊపిరైనట్టు… నా లోపలున్నట్టు…
ఏదో చెబుతున్నట్టు ఏవో కలలూ.. ..
Chali Chaliga Allindi Song Lyrics in Telugu -Mr. Perfect – చలి చలిగా అల్లింది