ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu: డబ్బులు సంపాదించడానికి రకరకాల మార్గాలు. అయితే, బయటకు వెళితే, ఇంట్లో ఎలా అని చాలా మంది సంకోచిస్తుంటారు. అయితే, ఇంట్లోనే కూర్చుని నెలకి రూ.40వేలు సంపాదించొచ్చు. అది ఎలాగో తెలుసుకోండి.
కెరీర్ కుటుంబాన్ని చూసుకోవడంలో పడి, కెరీర్ వదులుకున్న మహిళలు ఎందరో. అలాంటి వారిలో ఆమె కూడా ఒకరు. అయితే, ఆమె నిరుత్సాహపడలేదు ఢిల్లీకి చెందిన ఢిల్లీకి చెందిన నేహా నారంగ్ ఇంజినీరింగ్ చేసింది. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు. కుటుంబం కోసం ఐటీ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. అయితే, ఖాళీగా ఉండడం కంటే ఇంట్లో నుంచే ఏదైనా పనిచేయ వచ్చా అని ఆలోచించింది.
ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్‌లో పిల్లలకు లెక్కలు చెప్పడం ప్రారంభించింది. ఎనిమిదో తరగతి వరకు పిల్లలకు గణితం చెబుతుంది. అలాగే, టీచర్లకు కూడా 2గంటల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది. క్యూఏమత్ నేహా టాలెంట్ చూసి ఆమెతో క్యూఏమత్ అనే కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ కంపెనీకి దేశవ్యాప్తంగా 3000కు పైగా సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో అందరూ మహిళా టీచర్లు, అందులోనూ ఇంటిదగ్గరి నుంచి పనిచేసేవారే ఎక్కువ.
ఆన్‌లైన్ టెస్ట్, ఆ తర్వాత ఓ ఫామ్ నింపాలి. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక మీకు కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది. ఓ ఆన్‌లైన్ టెస్ట్, మరో టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో పాస్ అయితే మీరు టీచర్ అయిపోయినట్టే.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.