ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu: మీరు తక్కువ పెట్టుబడితో మంచి భవిష్యత్ ఉండే వ్యాపారం చేయాలనుకుంటే పేపర్ బ్యాగ్స్ తయారీ మంచి ఆప్షన్. ఈ వ్యాపారం చేయడం ఎలా తెలుసుకుందాం రండి.
ప్లాస్టిక్ కవర్ల ఈ మధ్య అందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగింది. ప్లాస్టిక్ కవర్లను వదిలేసి పేపర్ బ్యాగ్స్ వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా వినియోగం మరింత పెరుగుతుంది. అంటే ఈ రంగంలో వ్యాపార అవకాశాలు కూడా పెరిగినట్టే కదా.
పేపర్ బ్యాగ్స్ మీరు పేపర్ బ్యాగ్స్ యూనిట్ పెట్టాలనుకుంటే.. ప్రభుత్వం మీకు రూ.కోటి వరకు లోన్ ఇస్తుంది. ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రెండ్ అనే ప్రభుత్వ పథకం కింద మీకు ఈ లోన్ లభిస్తుంది
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మీకు అనుభవం లేదు కదా అని భయపడాల్సిన పనికూడా లేదు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ – ముంబై, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ – అహ్మదాబాద్ నుంచి ట్రైనింగ్ లభిస్తుంది. దీనితోపాటు మీరు www.udyamimitra.in వెబ్‌సైట్‌లో కూడా మరింత అవగాహన పెంచుకోవచ్చు.
ఒకవేళ భూమి ఒకవేళ భూమి కొని, అందులో భవనం కట్టి.. అందులో యూనిట్ నెలకొల్పుతామంటే మీకు ప్రభుత్వం నుంచి రూ.32 లక్షల వరకు రుణం లభిస్తుంది. మీరు అద్దె భవనంలో కూడా దీన్ని నెలకొల్పవచ్చు.
రూ.14.5 లక్షలు ప్లాంట్ ఎండ్ మిషనరీ కోసం రూ.14.5 లక్షలు, ఇతర చిన్న వస్తువులు రూ.3లక్షలు, P&P ఎక్స్‌ప్రెస్ కింద రూ.4.67లక్షలు, వర్కింగ్ క్యాపిటల్ కింద రూ. 91.64 లక్షల చొప్పున మొత్తం కోటీ 48లక్షల రూపాయలకి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి. ముడి సరుకు కూడా వర్కింగ్ క్యాపిటల్‌లోనే ఉంటుంది.
లాభం ప్రాజెక్టును అనుసరించి మీకు తొలి ఏడాదికి సుమారు రూ.1.75 లక్షల లాభం ఉంటుంది. రెండో ఏడాది రూ.6.07లక్షలు, మూడో ఏడాది రూ.10.78 లక్షలు, నాలుగో సంవత్సరం రూ.12.17 లక్షలు, ఐదో సంవత్సరం రూ.13.56 లక్షల లాభం ఉంటుంది.
లోన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫ్రెండ్ పథకం కింద ప్రాజెక్టును అనుసరించి మీకు సుమారు రూ.1.03 కోట్ల వరకు లోన్ లభిస్తుంది. మీరు రూ.45లక్షల డబ్బు పెట్టాల్సి ఉంటుంది.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.