Business Ideas in Telugu – తల వెంట్రుకలతో వ్యాపారం – కోట్లకు కోట్ల ఆదాయం గ్యారంటీ..!
Hair Business: మన దేశంలోనూ వెంట్రుకలతో వ్యాపారం చేసే వారు చాలా మందే ఉన్నారు. వాటినే ఆదాయ వనరుగా మర్చుకొని.. విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇండియా నుంచి దాదాపు 4 మిలియన్ డాలర్ల విలువైన జుట్టు విదేశాలకు ఎగుమతి అవుతోంది.
2020లో విదేశాలకు పంపిన తల వెంట్రుకల్లో 39 శాతం వార్షిక పెరుగుదల నమోదయింది. తల నుంచి కత్తిరించిన ఈ వెంట్రుకలతో కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణాల్లో కూడా ఇంటింటికీ వెళ్లి వెంట్రుకలను సేకరిస్తారు.

ఆ వెంట్రుకలను విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోల్‌కతా నుంచి 90శాతం వెంట్రుకలను చైనాలోనే విక్రయిస్తున్నారు. ఐతే గుజరాత్ వెంట్రుకలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అక్కడి వెంట్రుకలు దృఢంగా, మెరుస్తూ ఉండడం వల్లే డిమాండ్ అధికంగా ఉంటుంది. రేటు కూడా బాగుటుంది.
ఈ వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు విగ్గుల తయారీలో వినియోగిస్తారు. కత్తిరించిన జట్టును శుభ్రం చేసి.. ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. అనంతరం స్ట్రెయిట్ చేసి వాడుతారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత చైనా వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి. అలాంటి వాటికే విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

భారత దేశంలో స్వాతంత్య్రాని కంటే ముందు నుంచే వెంట్రుకల వ్యాపారం జరుగుతుంది. భారతీయ మహిళ జట్టు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనోళ్ల జట్టు చాలా పొడుగ్గా ఉంటుంది. నల్లగా మెరుస్తుంది. అందుకే వీటికి అధిక ధర లభిస్తుంది. రంగు వేయని జట్టుకైతే.. మార్కెట్లో మంచి రేటు వస్తుంది.
బాగా పొడవు ఉండి.. నిగనిగలాడే దృఢమైన జట్టుకు.. కిలోకు రూ.50 వేల వరకు చెల్లిస్తారు. ఆసియాలోని చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ దేశాలకు పంపిస్తారు. అమెరికా, యూరప్‌లో దేశాలు కూడా భారత్ నుంచి వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి.
మన దేశంలోని ప్రముఖ ఆలయాల్లో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు.ముఖ్యంగా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్ల నిత్యం వేలాది మంది తలనీలాలు సమర్పిస్తారు. అలా భక్తులు సమర్పించిన వెంట్రుకలను టీటీడీ వేలంలో విక్రయిస్తారు.
2014 లో రూ.220 కోట్ల వెంట్రుకలను విక్రయించారు. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేయాలనుకుంటే ఇంటికి ఇంటికీ తిరిగి జుట్టును సేకరించే వారితో పాటు ఆలయాలతో ఒప్పందం చేసుకోవచ్చు. అనంతరం ఆ వెంట్రుకలను పెద్ద పెద్ద కంపెనీలకు విక్రయించి.. భారీగా డబ్బు సంపాదించవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
Business Ideas in Telugu, Telugu Business Ideas, Best Business Ideas, 2022 Business Ideas, 2023 Business Ideas