Business Ideas in Telugu: ఈ రోజుల్లో అనేక మంది సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే పెట్టుబడికి పైసల్లేక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం పెట్టుబడి లేకుండానే ప్రారంభించే బిజినెస్ ఐడియాలు..
ఉద్యోగం ద్వారా కాకుండా సొంతంగా ఎదగాలని నేటి యువత భావిస్తున్నారు. చాలా మందివినూత్న ఆలోచనలతో అద్భుతాలను సృష్టిస్తున్నారు. అయితే అనేక మంది వారిలో ఉన్న టాలెంట్ ను సద్వినియోగం చేసుకుని అద్భుతాలను సృష్టించగలమని తెలియక ఉన్నత స్థాయికి ఎదగలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఈ బెస్ట్ బిజినెస్ ఐడియాలు..
ఈ రోజుల్లోని యువతలో సోషల్ మీడియా, పాలిటిక్స్ పై అవగాహన లేని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఈ అవగాహనను పెట్టుబడిగా మార్చుకుని అద్భుతాలు సృష్టించవచ్చు. మీరే మరో పది మందికి పని కల్పించే స్థాయికి చేరొచ్చు. ఆ వివరాలు మీ కోసం..
ప్రస్తుతం అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఖాతాలను ఏర్పాటు చేసుకుని తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఖాతాలన్నీ వారి పేరు మీద కనిపిస్తూ ఉన్నా వాటిని మెయింటేన్ చేసే వారు మాత్రం వేరే వారు ఉంటారు.
సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుంటున్నారు అనేక మంది. ఆయా నిపుణుల ద్వారా వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా వేర్వేరు పేర్లతో కూడా ఖతాలను కూడా తెరిచి తద్వారా వారికి తగిన పబ్లిసిటీ లభించేలా, వారు చేసే పనులు ప్రజల్లోకి వెళ్లేలా చేసుకుంటారు.
మీకు కూడా ఇలా సోషల్ మీడియాపై అవగాహన, ఖాతాల నిర్వహణపై ఆసక్తి ఉంటే ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా వ్యవహరించవచ్చు. దీనికి ఎక్కువ శ్రమ ఉంటుంది అనుకుంటే పొరపాటే. మీరు ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ముందు కూర్చుని వారు పంపించే ఫొటోలు, ఇతర కంటెంట్ ను ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా తీర్చితిద్ది సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేస్తే చాలు.
అయితే ..మీకు ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్ పై అవగాహన ఉంటే మీరు ఈ పనిలో మరింతగా రాణించవచ్చు. మీ పని తీరు, మీరు పని చేసే వ్యక్తి స్థాయి ఆధారంగా మీకు పారితోషకం ఉంటుంది. అయితే, మొదటగా చిన్న చిన్న స్థాయి వ్యక్తులకు సోషల్ మీడియా అడ్మిన్ గా వ్యవహరించి పనిలో పట్టు సాధిస్తే.. మంచి అవకాశాలు లభిస్తాయి.
మీరు ఇందులో పేరు తెచ్చుకుంటే.. ఒకే సారి అనేక మంది సోషల్ మీడియా ఖాతాలను మెయింటెన్ చేసే అవకాశం కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరు మీ కింద కొందరిని నియమించుకుని మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. తద్వారా లక్షలు సంపాధించుకోవచ్చు.
అయితే.. మొదటి అవకాశం లభించి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే వరకు మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇందు కోసం ఇప్పటికే ఇలాంటి పని చేసే వారిని కలవడం, ప్రముఖులను సంప్రదించి అవకాశం కోసం అభ్యర్థించడం చేయాలి. అవకాశం లభిస్తే కొన్ని రోజులు ఫ్రీగా పని చేయడానికి కూడా వెనకాడొద్దు.
అయితే.. ఒక్క సారి మీరు మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అవకాశాలు మిమ్ముల్ని వెతుక్కుంటూ వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. తద్వారా లక్షలు ఆఫర్ చేసి మిమ్ముల్ని ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా నియమించుకుంటారు.
మరో బిజినెస్ ఐడియా.. ఈ రోజుల్లో రాజకీయాలపై అవగాహన లేని యువత అస్సలు కనిపించడం లేదు. చాలా మంది వార్తలను ఫాలో అవుతూ ఉంటారు. ఆ నేత అలా మాట్లాడి తప్పుడి తప్పు చేశాడు. ఈ నాయకుడు ఇలా మాట్లాడితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు.
అయితే.. అనేక మంది నాయకులు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లను నియమించుకుంటున్నారు. దీంతో వారికి డిమాండ్ పెరిగింది. మీకు కూడా రాజకీయాలపై అమితంగా ఆసక్తి, అవగాహన ఉంటే మీరు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. పొలిటికల్ అనలిస్ట్ గా మారి ఉన్నత స్థాయిలో స్థిరపడొచ్చు.
ప్రస్తుతం 80 శాతం మంది నాయకులు పొలిటికల్ అనలిస్ట్ లను, సర్వే టీంలను నియమించుకుంటున్నారు. దీంతో ఈ రంగంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
మీరు కూడా పొలిటికల్ అనలిస్ట్ గా మారాలంటే తొలుత కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అప్ కమింగ్ పొలిటీషన్లను కలిసి వారికి మీ టాలెంట్ గురించి వివరించాలి. అవసరమైతే వారికి మీ పైన నమ్మకం కలిగే వరకు ఉచితంగా సేవలు అందించాలి.
మీ వ్యూహాలు వారికి ప్రయోజనం కలిగిస్తే వారు తప్పనిసరిగా మిమ్ములను వారి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా నియమించుకుంటున్నారు. మీ సక్సెస్ పర్సంటేజ్ ఆధారంగా మీకు పారితోషకం ఉంటుంది. ఈ రంగంలో మీరు మంచి పేరు తెచ్చుకుంటే.. మీరు కొందరు యువకులను నియమించుకుని సర్వేలు కూడా నిర్వహించవచ్చు.
ఈ రోజుల్లో దాదాపు అందరు రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు సర్వేలను నిర్వహించుకుంటూ వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను అంచనా వేసుకుంటూ ఉంటున్నారు. అలాంటి వారికి మీరు సేవలు అందించడం ద్వారా మంచి ఆదాయం ఆర్జించవచ్చు. తద్వారా మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించిన వారు అవుతారు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.