ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చాలామంది సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ సరైన పెట్టుబడి లేక వెనుకడుగు వేస్తారు. అయితే మీకు వ్యాపారం ప్రారంభించి విజయం సాధిస్తామనే నమ్మకం, ధీమా ఉంటే మూలధనం ఎక్కువగా అవసరం లేకుండానే ప్రారంభించవచ్చు. అనేక చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ఎదిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో డబ్బులు ఏమాత్రం లేకుండానే వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడి లేదా పెట్టుబడి లేని వ్యాపారాలు కొన్ని తెలుసుకుందాం….
పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది. భార్యాభర్తలు ఉద్యోగాలతో బిజీ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో బేబీ సిట్టింగ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది. పిల్లల్ని మేనేజ్ చేసే సామర్థ్యం ఉంటే పెద్దగా పెట్టుబడి లేకుండానే డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారానికి దాదాపు పెట్టుబడి జీరో అని చెప్పవచ్చు. బేబీ సిట్టర్స్ లేదా బేబీ సెంటర్స్‌లో పిల్లల్ని చూసుకోవడానికి పెట్టుబడి అవసరం లేకున్నప్పటికీ చిన్న పిల్లలు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ కాలంలో బ్యూటీషియన్లకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు బ్యూటీషియన్లు హోమ్ సర్వీస్ కూడా చేస్తున్నారు. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న వారికి ఇది లాభదాయక ప్రతిపాదన. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు బ్యూటీషియన్స్ ఇళ్లకు వెళ్లి సేవలు చేస్తున్నారు. బ్యూటీషియన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలంటే పెట్టుబడి అవసరం. కానీ హోమ్ సర్వీస్‌కు మూణ్ణాలుగు వేలు చేతిలో ఉంటే సరిపోతుంది.
మీరు వంటలో నైపుణ్యం కలిగిన వారు అయితే టిఫిన్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. బిజీ బిజీ లైఫ్ కారణంగా ప్రస్తుతం చాలామంది ఉదయం, సాయంత్రం ఎక్కువగా టిఫిన్స్ వంటివి హోటల్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం, రాత్రికి కరీస్ కూడా కరీ పాయింట్ నుంచి తెచ్చుకునేంత బిజీ లైఫ్ అయిపోయింది. ఎక్కువమంది ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఇష్టపడతారు. కాబట్టి ఇంటి ఫుడ్‌గా టిఫిన్ సెంటర్ నిర్వహించవచ్చు. దీనికి కాస్త పెట్టుబడి అవసరం.
పెట్ కేర్ సెంటర్ మీరు పెంపుడు జంతువులను ప్రేమించగలిగితే, వాటిని జాగ్రత్తగా చూసుకోగలిగే సామర్థ్యం ఉంటే పెట్ కేర్ సెంటర్స్ నిర్వహించవచ్చు. మీకు సొంతగా స్థలం ఉంటే పెద్దగా పెట్టుబడి అవసరం లేదు.
ట్యాక్సీ సర్వీస్‌లు ప్రయాణీకులను చేరవేసేందుకు ఇప్పుడు ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఓ కారు లేదా బైక్ ఉంటే చాలు ప్రైవేటు రంగ సంస్థల ద్వారా నడుపుకోవచ్చు. లేదా మీరే సొంతగా నడుపుకోవచ్చు. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వాటిలో ట్యాక్సీ సేవలు ముఖ్యమైనవి. సొంత వాహనం ఉంటే పెట్టుబడి అవసరం లేదు.
ట్యూషన్లు ప్రస్తుత కాలంలో స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఉదయం లేదా సాయంత్రం ట్యూషన్స్ తప్పనిసరి అయ్యాయి. డబ్బు సంపాదించేందుకు ఇది కూడా ఓ మార్గం. అయితే మీరు ఎంచుకున్న సబ్జెక్టులో నిపుణులై ఉండాలి. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పే సామర్థ్యం ఉండాలి. ఇది ఉంటే చాలు.. పెట్టుబడి లేకుండానే ట్యూషన్స్ ద్వారా సంపాదించవచ్చు.
కుకింగ్ క్లాస్‌లు మీరు వంటలు చేయడంలో బాగా నైపుణ్యం కలవారైతే సంపాదన కోసం కుకింగ్ క్లాస్‌లు కూడా నిర్వహించవచ్చు. ప్రస్తుతం చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వంటలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నేరుగా ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది పెట్టుబడి లేని వ్యాపారం.
డ్యాన్స్, ఏరోబిక్ క్లాస్‌లు డ్యాన్స్, ఏరోబిక్ క్లాస్‌ల ద్వారా కూడా పెట్టుబడి లేకుండా సంపాదించవచ్చు. భరతనాట్యం, కూచిపూడి, సంగీతం, యోగా క్లాస్‌ల ద్వారా కూడా ఇప్పుడు సంపాదించుకోవచ్చు.
కొరియర్ కంపెనీ చాలా కొరియర్ కంపెనీలు ఆయా ప్రాంతాల్లో తమకు అనుగుణంగా ఉండే ఫ్రాంచైజీలను కోరుకుంటాయి. డిమాండ్ ఉండి కొరియర్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఫ్రాంచైజీ ఓపెన్ చేయవచ్చు. దీనికి పెట్టుబడి, మ్యాన్ పవర్, స్థలం అవసరం.
ఫ్రీలాన్సర్ రైటింగ్, డిజైనింగ్ వంటి వాటిల్లో ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు. ఈ రంగంలో నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి.
ఫైనాన్షియల్ లేదా పోర్ట్‌పోలియో కన్సల్టెంట్ మీరు ఆర్థిక సేవల్లో నిపుణులైతే పోర్ట్ పోలియో కన్సల్టెంట్‌గా ముందుకు సాగవచ్చు. దీనికి పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం లేదు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.