Business Ideas in Telugu – ముత్యాల సాగు – లక్షల సంపాదన
కరోనా లాక్‌డౌన్ (Corona Lockdown) సమయంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డారు. చేసేందుకు పనిలేక.. చేతిలో డబ్బులు లేక.. ఇబ్బంది పడ్డారు. రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్‌కు చెందిన 41 ఏళ్ల రజా మహమ్మద్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. ప్రైవేట్ స్కూల్‌లో ఆయన టీచర్‌గా పనిచేసేవారు. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడడంతో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయి.. రోడ్డున పడ్డారు. ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకపోయింది. చిరవకు ఓ వ్యక్తి ద్వారా ముత్యాల సాగు గురించి తెలుసుకున్నాడు. ఆయనకున్న 12 గుంటల భూమిలో ముత్యాల సాగు (Pearl Farming)ను చేపట్టి.. విజయవంతమయ్యారు.
1000 ఆయెస్టర్‌లతో ముత్యాల పెంపకాన్ని ప్రారంభించారు రజా మహమ్మద్. ఇందుకోసం రూ.50వేల పెట్టుబడి అవసరమైంది. ఒక్క ఆల్చిప్పకు సగటు ధర 10-12 రూపాయలు ఖర్చయింది. కేరళ, ముంబై, సూరత్‌ల నుంచి ఈ ఆల్చిప్పలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఒక బ్యాచ్ ఆల్చిప్పలతో ముత్యాల తయారీకి దాదాపు 15-20 నెలలు పడుతుంది.
50 శాతానికి పైగా ఆల్చిప్పలు చెడిపోయినప్పుడు.. నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆల్చిప్పలను ప్రతిరోజూ పరిశీలిస్తుండాలి. పీహెచ్, అమ్మోనియా స్థాయులను చెక్ చేయాలి. లేదంటే మరింత నష్టం జరిగే అవకాశముంది.

ఆల్చిప్పల్లో తయారైన ముత్యాల్లో కొన్నింటి నాణ్యత చాలా బాగుంటుంది. కొన్ని మాత్రం అంత బాగుండవు. నాణ్యత బట్టే మార్కెట్లో రేటు లభిస్తుంది. గుండ్రని ముత్యాల ధర మార్కెట్లో డిజైన్ చేసిన ముత్యాల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. కానీ గుండ్రి ముత్యాలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే వస్తాయి. ఒక ఆల్చిప్పలో మూడు ముత్యాలు ఉంటే..
అందులో ఒకటి గుండ్రని ముత్యం ఉంటే.. మిగతా రెండు సాధారణమైనది లభ్యమవుతాయి. ముత్యాల పెంపకం ద్వారా తన వార్షిక ఆదాయం 2 నుంచి 3 లక్షల రూపాయలకు ఉందని రజా తెలిపారు. దీనికి పెద్ద శ్రమ, సమయం అవసరం లేనందున.. ట్యూషన్స్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం 2వేల ఆయెస్టర్లతోనే ఆయన ముత్యాల సాగు చేస్తున్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింత విస్తరిస్తానని…అప్పుడు మరింత లాభాలు వచ్చే అవకాశముందని తెలిపారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
Business Ideas in Telugu – ముత్యాల సాగు – లక్షల సంపాదన