ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu – ఇంటి దగ్గర వుండి డబ్బులు సంపాదించే మార్గాలు
చాలా మంది చదువుకుని ఉద్యోగ అవకాశాలు లేక కాలీగా వుంటున్నారు. మరి కొంత మంది ఒకరి దగ్గర పని చెయ్యడం ఇష్టం లేక ఇంటి దగ్గరే వుండటానికి ఇష్ట పడుతున్నారు. అలాంటి వారి కోసం తక్కువ పెట్టు బడితో ఎక్కువ లాభాలు వచ్చే కొన్ని వ్యాపారాలు ఇక్కడ చూద్దాం అందులో కొన్ని.
బ్లాగింగ్ – Blogging
మీకు తెలిసిన టాపిక్ , బాగా వచ్చిన టాపిక్స్ బ్లాగింగ్ చేస్తూ మీరు డబ్బు సంపాదించవచ్చు , దీనికి డబ్బు పెట్టాల్సిన పనికూడా లేదు, ఫేస్బుక్ లో కొన్ని పోస్ట్ లు షేర్ చేసి చేసి కొంచెం ట్రాఫిక్ వచ్చాక మీరు గూగుల్ యాడ్స్ కి అప్లై చేసుకుంటే ఈజీ గా అప్రూవల్ అవుతుంది దీనికి కావాల్సింది జెన్యూన్ గా కంటెంట్ రాయటమే ఇంకా వేరే బ్లాగ్స్ కంటెంట్ కాపీ చేయకుండా మీకు తెలిసిన వొకాబులరీ తో రాయటమే. ఇలా బ్లాగింగ్ ని కెరీర్ గా చేసుకొని చాల మంది సెటిల్ అయ్యారు కూడా.
కాస్ట్యూమ్ జువెలరీ – Costume Jewelry
యువత ప్రస్తుతం ఫ్యాషన్, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇక్కడ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఫ్యాషన్, స్టైల్ వంటి వాటిల్లో వాళ్లు ఎప్పుడు ముందే ఉంటారు. కస్ట్యూమ్ జువెలరీ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరేమో. వీటి వల్ల అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో దేశంలో కాస్ట్యూమ్ జువెలరీ మార్కెట్‌లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. చాలా మంది ఎంట్రప్రెన్యూర్లు.. హోల్‌సెల్లర్ల నుంచి జువెలరీని కొనుగోలు చేసి, దాన్ని కస్టమర్లకు డైరెక్ట్‌గా విక్రయిస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్ కూడా ఉపయోగిస్తు్న్నారు.
రెంటల్ బిజినెస్ – Rental Business
ఈ బిజీ లైఫ్ లో రెంటెడ్ హౌసెస్ చూసుకునే టైం కూడా లేకుండా పోయింది, మీరు తీరిక సమయం లో ఇల్లు ఎక్కడెక్కడ కాలీగా వున్నాయో చూసి చిన్న గా అవసరమైన వాళ్ళ నెంబర్ వివిద రకాల యాప్స్ నుండి సేకరించి వారికి కాల్ చేసి ఇంటి ఇల్లు చూపించి ఒక మంత్ రెంట్ ఎంతో అంత వారికి ఛార్జ్ చెయ్యొచ్చు అలానే, ఇంటి యజిమాని వద్ధ నుండి కూడా కొంత తీసుకోవచ్చు.
ఆన్లైన్ ట్యూషన్స్ – Online Tuitions
మీకు అందుబాటులో ఉన్న కొన్ని ఆన్లైన్ పోర్టల్ లో కొంత డబ్బులు కట్టి ఎప్పుడు బిజీ గా ఉండొచ్చు, ఇందుకు గాను మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు లేదా క్వికర్ లాంటి ఆన్లైన్ పోర్టల్ లో ఫ్రీ గా పోస్ట్స్ చేసి స్టూడెంట్స్ ని పొందవచ్చు.
గ్రీన్ టీ – Green Tea
ఇటీవల ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యకరమైన ఆనందమైన జీవనం కొనసాగించాలని చాలా మంది భావిస్తున్నారు. అందుకే గ్రీన్ టీకి ప్రాధాన్యం పెరిగింది. బ్లాక్ టీ కన్నా గ్రీన్ టీనే ఫేమస్. గ్రీన్ టీతో చాలా ప్రయోజనాలున్నాయి. ఈ వ్యాపారం కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే.
యూట్యూబ్ వీడియోస్ – YouTube Channel
మీకు తెలిసిన సబ్జెక్టు ని అర్ధం అయ్యేలా చెప్పగలిగితే , మీకు వచ్చిన కల ని ఉదాహరణకి ట్రావెలింగ్ .., సినిమా న్యూస్, సినిమా రివ్యూస్, ప్రాంతాలు విశేషాలు, డివోషనల్ ఇలా ఏమైనా కావచ్చు జెన్యూన్ గా చెప్పగలిగితే సక్సెస్ ఈజీ గా అవచ్చు సబ్స్క్రైబర్స్ ని పొంద వచ్చు.
మొబైల్ యాక్ససిరీస్ – Mobile Accessories
స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి. దీంతో మొబైల్ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. వీటికే కాదండోయ్.. మొబైల్ యాక్ససిరీస్‌కు కూడా అంతే డిమాండ్ ఉంది. హెడ్‌ఫోన్స్, పవర్ బ్యాంక్స్, పెన్‌డ్రైవ్స్, మొబైల్ కవర్స్ వంటి వాటికి యూత్‌లో ఫుల్ డిమాండ్. వీటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు పొందొచ్చు.
ఎస్ ఈ ఓ – SEO
ఎస్ ఈ ఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ , ఈ కోర్స్ యూటుబ్స్ లో దొరుకుతుంది , దీనికి చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే చాల మంది వెబ్సైట్ రన్ చేస్తున్నారు వాళ్ళకి ప్రమోషన్ చేసుకునే తీరిక ఉండదు ఇందుకు గాను మీరు వాళ్ళ సైట్ ని ప్రమోట్ చేయటం వల్ల మీరు ఇంటినుండి డబ్బులు సంపాదించవచ్చు, దీనికి కంప్యూటర్ ఇంకా ఇంటర్నెట్ ఉంటె సరిపోతుంది.
ఆన్లైన్ బర్త్డే కేక్ బిజినెస్ – Online Birthday Cake Business
బర్త్డే రోజున కేక్ కట్ కట్ చేయటం సాధారణం , ఎవరికైనా అవసరమే కొందరికి ముఖ్యం గా ఆఫీస్ పనులకి పోయే వారికి అసలు తీరిక ఉండదు దీనికి ఒక వెబ్సైటు తాయారు చేపించి అందులో ఆర్డర్స్ పొందటం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
టిఫిన్ సర్వీసులు – Tiffin Service
జీవితం బిజీబిజీ అయిపోయింది. అన్నం తినడానికి కూడా తీరిక లేకుండా పోతోంది. ఐటీ, కాల్ సెంటర్ ఉద్యోగులు టిఫిన్ సర్వీసులతో రిలీఫ్ పొందుతున్నారు. మీరు రుచిగా వండేవారు అయితే ఈ బిజినెస్ కూడా ట్రై చేయవచ్చు.
కంటెంట్ రైటర్ – Content Writer
కంటెంట్ రైటర్ జాబ్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చిన ఆ లాంగ్వేజ్ పైన జాబ్స్ ఉన్నాయి కానీ దీనికి కావాల్సింది మీ స్టైల్ లో మీరుగా అందరికి నచ్చేలా రాయటమే, ఒకేసారి ఒకటి నుండి పది వెబ్సైటు లకి ఫ్రీలాన్స్ గా చేసుకోవచ్చు.