Menu Close

మనసు ప్రశాంతంగా ఉండటానికి మన శ్వాసకి సంబంధం ఏంటి


మనసు ప్రశాంతంగా ఉండటానికి మన శ్వాసకి సంబంధం ఏంటి

శ్వాసక్రియ కు మనసు చేసే కార్యకలాపాలకుా సన్నిహిత సంబంధం వుంటుంది. మనసు కల్లోలంగా వుంటే శ్వాస కుాడా సక్రమంగా వుండదు. క్రమబధ్దమైన శ్వాస మనసును ప్రశాంతంగా వుంచుతుంది.. దీనికి ప్రాణాయామం దోహదపడుతుంది .

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

మన పుార్వకర్మల వలన కలిగే అజ్ఞానాన్ని ప్రాణాయామం నశింపచేస్తుందనీ పతంజలి మహర్షి రచించిన యెాగసుాత్రాలలో తెలపబడి వుంది.

breathing

అర్హులైన గురువు దగ్గర ప్రాణాయామం అభ్యసిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది …అలా కాకుండా మన ఇష్టప్రకారం క్రమపద్ధతిలో అభ్యసించకుంటే అది భౌతిక మానసిక వ్యాధులకి గురిచేస్తుందట.

అందుకే ప్రాణాయామం అత్యంత శ్రద్దగా, జాగ్రత్తగా సాధన చేయాలి..

దానికి వివేకానందుడు ఒక కధ ద్వారా “రాజయెాగ గ్రంధం లో” వివరించారు ….!!

ఒక రాజు దగ్గర ఒక మంత్రి వున్నాడు.అతను ఒక విషయం లో రాజు గారి కోపానికి గురి అయినాడు.అతనిని రాజు ఒక ఎత్తైన కోటలో బంధించమని శిక్ష విధించాడు.ఆ కోటలో మంత్రి ఆహారం లేక మరణించాలనేది రాజు విధించిన శిక్ష.

ఆ మంత్రి కి ప్రతివ్రత అయిన భార్య వుంది. ఆమె ఒక రోజు రాత్రి కోట దగ్గరకు వచ్చి తాను ఏవిధంగా సహాయ పడగలన నీ భర్తని అడిగింది.

అతను మరుసటి రోజు రాత్రి కోటవద్దకు రమ్మనీ , వచ్చేటప్పుడు తనతోపాటు లావుపాటీ తాడు, మందపాటి దారము, పురికొస, పట్టుదారము, ఒక కుమ్మరిపురుగు , కొంచెం తెనె తెమ్మన్నాడు.

ఇవన్నీ దేనికో అని ఆమె మనసులో అనుకొని ఆశ్చర్యపడింది…!!

భర్త అడిగిన వన్నీ తీసుకొని మరుసటిరోజు రాత్రి కోట వద్దకు వచ్చింది .ఆ భర్త ఆమెతో ఆ కుమ్మరిపురుగుకి పట్టుదారం గట్టిగా కట్టమనీ , దాని మీసాలకు ఒక బొట్టు తెేనె పుార్తీగా రాయమనీ , ఆ తరువాత కుమ్మరిపురుగుని పైకి వదలమన్నాడు.ఆమె భర్త చెప్పినట్లు అన్ని చేసింది …!!

ఆ కుమ్మరి పురుగు తన సుదీర్ఘ ప్రయాణం కొనసాగించింది .తేనె వాసన ను ఆఘ్రాణిస్తుా, తేనెను చేరుకుందామనే ఆశతో అది పై పైకి వెళ్లి చివరికి ఆ ఎత్తైన కోట పైకి చేరుకుంది .మంత్రి ఆ పురుగును పట్టుకొని ఆ పట్టుదారాన్ని చేతిలోకి తీసుకున్నాడు. పట్టుదారం యెుక్క చివరి కొస కి సన్నని దారం ముడివేయమనీ భార్య కి చెప్పి, ఆ సన్నని దారన్ని పైకి లాక్కొన్నాడు.

సన్నని దారం పైకి వచ్చాక, దాని సహాయంతో మందపాటి దారాన్ని, చివరకు పెద్ద లావుపాటీ తాడును పైకి లాక్కోన్నాడు.

ఆ తరువాత పద్దతి అంత సులభం అయిపోయింది. మంత్రి ఆ తాడు సహాయంతో ఎత్తైన కోట బురుజు మీద నుండి కింద కు దిగి తప్పించుకొన్నాడు.!!

మన శరీరంలో శ్వాస కదలిక “పట్టుదారం” వంటిది. దానిని పట్టుకొని స్వాధీనంలో కి తెచ్చుకుంటే “నరాల ప్రవాహం” అనే సన్నని దారం లభిస్తుంది. వాటి నుండి మందపాటి దారంలాంటి మనసు భావాలు వశంలో వుంటాయి.

చివరకు ప్రాణమనే లావైన త్రాడు దొరుకుతుంది. దానిని పట్టుకొని స్వాధీనంలో తెచ్చుకుంటెే, బంధించిన మంత్రి కి స్వేచ్ఛ లభించినట్లు… మన ఆత్మ కు స్వేచ్ఛ లభిస్తుంది…!!

10 Breathing Techniques for Stress Relief
Breathing to reduce stress
Deep breathing cures everything
Breathing exercises to help lungs
Deep breathing benefits
Breathing techniques for anxiety

గమనిక : ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇతర మాద్యమాల నుండి సేకరించబడింది. ఈ సమాచారాన్ని TeluguBucket.Com ధృవీకరించడం లేదు. ఈ పోస్ట్ తో మీకేమైనా ఇబ్బంది కలిగినట్లైతే తెలుగు బకెట్ టీం ని సంప్రదించండి. ఈమైల్ – admin@telugubucket.com
Share with your friends & family
Posted in Telugu Articles, Health

Subscribe for latest updates

Loading