Menu Close

కిచెన్ లో బాగా ఉపయోగపడుతుంది.
కరెంట్ పోయినప్పుడు కూడా
4 గంటల పాటు ఆన్ లో వుండే లైట్.
అమెజాన్ లో ఆఫర్👇👇

Buy Now

Bigg Boss Season 6 Telugu – Full Contestants List – కంటెస్టెంట్స్ వివరాలు

Bigg Boss Season 6 Telugu – Full Contestants List – కంటెస్టెంట్స్ వివరాలు

1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)

For Latest Updates

మా కంటెంట్ మీకు నచ్చినట్లైతే
మా యూట్యూబ్ చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

Bigg Boss Season 6 Telugu Contestants Biographies

కీర్తి కేశవ్‌ భట్‌ – Keerthi Keshav Bhat Biography – Bigg Boss Season 6 Telugu Contestants

తెలుగు ప్రేక్షకులకు కీర్తి భట్ అంటే తెలియదు కానీ.. భాను అంటే గుర్తుపడతారు. ‘మనసిచ్చి చూడు’సీరియల్‌లో భానుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది కీర్తి భట్. ఈ సీరియల్‌లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బెంగుళూరు పుట్టిపెరిగిన ఈ కన్నడ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం.

keerthi Keshav Bhat Bigg Boss 6 Telugu Bucket

ఆ మక్కువతోనే యాక్టింగ్‌లో శిక్షణ పొంది డాన్స్ కూడా నేర్చుకుంది. ఉన్నత విద్యను అభ్యసించిన కీర్తి భట్. చదువు పూర్తి కాగానే కన్నడలో ఇండస్ట్రీలో అడుగుపెట్టివరుసగా మూడు సీరియల్స్ చేసింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ఈ మధ్యే ‘కార్తీకదీపం’ సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి..హిమ పాత్రలో నటిస్తోంది. ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి.. తనూ భట్ అనే చిన్నారిని దత్తత తీసుకుంది.

సుదీప (పింకీ ) – Sudeepa Pinky Biography – Bigg Boss Season 6 Telugu Contestants

రెండో కంటెస్టెంట్‌గా సుదీప ఎంట్రీ ఇచ్చింది. నువ్వునాకు నచ్చావ్‌ సినిమాలో పింకీ పాత్రలో నటించి ఫేమస్‌ అయింది సుదీప. ఈ సినిమాలో వెంకీ థిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఈ సినిమాతో ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న సుదీప చిన్నతనంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. 1994లో రవిరాజా పిన్నెశెట్టి దర్శకత్వంలో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Sudeepa Bigg Boss 6 Telugu Bucket

ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి సినిమాల్లో నటించింది. సుదీప ఎక్కువగా ఎక్కువగా హీరోలకి చెల్లెలు పాత్రలోనే నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌లో అలరించింది. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడిన సుదీప పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు బిగ్‌బాస్‌-6తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

శ్రీహాన్‌ – Shrihan Biography – Bigg Boss Season 6 Telugu Contestants

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్‌ అయిన శ్రీహాన్‌ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సిరితో కలిసి పలు షార్ట్‌ఫిల్మ్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో గుర్తింపు పొందాడు. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో సిరి-షణ్ముఖ్‌ లవ్‌ట్రాక్‌ వారిద్దరికి నెగిటివిటీని తెచ్చిపెడితే, శ్రీహాన్‌కు మాత్రం కలిసొచ్చింది.

Shrihan - Bigg Boss Season 6 Telugu Contestant Telugu Bucket

బిగ్‌బాస్ స్టేజ్‌పై శ్రీహాన్‌ మాట్లాడిన మాటలు, పాట పాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సిరిపై సోషల్‌ మీడియా అంతా ట్రోలింగ్‌ చేస్తున్న శ్రీహాన్‌ మాత్రం ఆమెకు అండగా నిలబడ్డాడు. ఇలా సిరి బాయ్‌ఫ్రెండ్‌గా వార్తల్లో నిలిచిన శ్రీహాన్‌ బిగ్‌బాస్‌ -6లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా మారే అవకాశం ఉంది. మరి శ్రీహాన్‌ పాజిటివిటీతోనే షో నుంచి బయటకు వస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.

నేహా చౌదరి – Neha Chaudhary Biography – Bigg Boss Season 6 Telugu Contestants

యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన నేహా చౌదరి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి ఇచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఉన్న ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టి పలు పలు షోలకు యాంకరింగ్‌ చేసింది.

Neha Chaudhary - Bigg Boss Season 6 Telugu Contestant Telugu Bucket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకర్‌గా నేహా చౌదరి మాంచి పాపులారిటీని దక్కించుకుంది. తెలుగుమ్మాయిగా బాంబే గడ్డపై యాంకరింగ్‌తో అలరించిన నేహా మరిప్పుడు బిగ్‌బాస్‌ షోలో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించనుంది అన్నది చూద్దాం.

చలాకీ చంటీ – Chalaki Chanti Biograohy – Bigg Boss Season 6 Telugu Contestants

బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలాకీ చంటీ. ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించినా ప్రముఖ కామెడీ షోతోనే చలాకీ చంటీ పాపులర్‌ అయ్యాడు. 2016 ఏప్రిల్‌లో ఇతనికి వివాహం జరిగింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలతో అలరించే చంటీ బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.

Chalaki Chanti Biograohy - Bigg Boss Season 6 Telugu Contestants Telugu Bucket

శ్రీ సత్య – Sri Satya Biography – Bigg Boss Season 6 Telugu Contestants

ఆరో కంటెస్టెంట్‌గా సీరియల్ నటి శ్రీ సత్య ఎంట్రీ ఇచ్చింది. డాన్స్ పెర్ఫామెన్స్‌తో స్టేజ్‌ని షేక్ చేసింది. నటి శ్రీసత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్‌ విజయవాడ టైటిల్‌ గెలిచింది. చిన్నప్పటి నుంచ నటనపై ఉన్న ఇష్టంతో నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్రలో అలరించింది.

Sri Satya Biography - Bigg Boss Season 6 Telugu Contestants

ఆ తర్వాత వెండితెర కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్‌ అయ్యింది. ముద్దమందారం , త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

అర్జున్‌ కల్యాణ్‌ – Arjun Kalyan Biography – Bigg Boss Season 6 Telugu Contestants

ఏడో కంటెస్టెంట్‌గా హీరో అర్జున్‌ కల్యాణ్‌ ఎంట్రీ ఇచ్చాడు. 2013లో ‘చిన్న సినిమా’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన అర్జున్‌ పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించాడు. వరుడు కావలెను, ఉప్మా తినేసింది, మిస్సమ్మ వంటి వెబ్‌ సిరీస్‌లతో గుర్తింపు పొందిన అర్జున్‌ ప్లేబ్యాక్‌, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లో నటించాడు. ఆంధ్రప్రదేశ్‌లోకి కొవ్వూరుకి చెందిన అర్జున్‌ యూఎస్‌లోని కెంటకీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. ఇక బిగ్‌బాస్‌-6లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఈ షో ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

Arjun Kalyan Biography - Bigg Boss Season 6 Telugu Contestants

గీతూ రాయల్ – Geetu Royal Biography – Bigg Boss Season 6 Telugu Contestants

ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అలియాస్ గలాటా గీతు ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ షోకి రావడానికి 3 కారణాలున్నాయని గీతు చెప్పుకొచ్చింది. అవి..

Geetu Royal Biography - Bigg Boss Season 6 Telugu Contestants
  1. చిన్నప్పటి నుంచి చాలా ఇన్‌సెక్యూరిటీస్‌ ఉన్నాయి. నా బాడీ అంటే నాకు ఇష్టం లేదు. లావుగా ఉన్నానని ఆపరేషన్‌ చేయించుకొని నెక్ట్స్‌ సీజన్‌కి వద్దామనుకున్నా. కానీ నా ఫ్రెండ్స్‌ సపోర్ట్‌తో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చేశా
  2. నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చా.గతంలో బిగ్‌బాస్‌ షోపై రివ్యూలు ఇచ్చేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను బిగ్‌బాస్‌లోకి వస్తే నాపై ఎలాంటి రివ్యూలు ఇస్తారు? అసలు నేను ఇక్కడ ఎలా ఉండగలను అని నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చా
  3. నేను ఇదే స్టేజ్‌పై టాప్‌-5లో ఉండి ఏదైనా సాధిస్తే ఆరోజు నా మూడో రీజన్‌ చెబుతా

గీతూ రాయల్‌.. జబర్దస్త్‌ చూసేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తనదైన హాస్యంతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ట్యాలెంటెడ్‌ నటి బిగ్‌బాస్‌ ఎనిమిదో కంటెస్టెంటుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

అభినయ శ్రీ – Abhinayashree Biography – Bigg Boss Season 6 Telugu Contestants

తొమ్మిదో కంటెస్టెం‌ట్‌గా అభినయ శ్రీ ఎంట్రీ ఇచ్చింది. తనకు బాగా పేరు తీసుకొచ్చిన ‘అ అంటే అమలాపురం’ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేస్తూ స్టేజ్‌ మీదకు వచ్చింది. స్నేహమంటే ఇదేరా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం పాటతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.

Abhinayashree Biography - Bigg Boss Season 6 Telugu Contestants

ఆ తర్వాత శ్వేత నాగు, అత్తిలి సత్తిబాబు, మైఖేల్ మదన కామరాజు వంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. తమిళ టెలివిజన్ షోలో జూనియర్ సూపర్ డాన్స్, డాన్స్ జోడి డాన్స్, వంటి పలు షోలకు హోస్ట్‌గానూ అలరించింది. 2014లో పాండవులు సినిమాలో చివరిసారిగా నటించింది. మరి బిగ్‌బాస్‌ షోతో వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో మళ్లీ కంబ్యాక్‌ ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది.

రోహిత్- మెరీనా – Bigg Boss Season 6 Telugu Contestant

పదో కంటెస్టెంట్స్‌గా రియల్‌ కపుల్‌ రోహిత్- మెరీనా వచ్చేశారు. వేరు వేరే రాష్ట్రాలకు చెందిన వీళ్లు ఒక్కటి ఎలా అయ్యారో వాళ్ల ప్రేమ కథను స్టేజ్‌పై చెప్పుకొచ్చారు. మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహం.‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్‌ అయిన మెరీనా ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’సీరియల్‌లో నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది.

Marina rohit - రోహిత్- మెరీనా - Bigg Boss Season 6 Telugu Contestant

మరోవైపు మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన రోహిత్‌ ‘నీలికలువలు’,’అభిలాష’,’కంటే కూతుర్నే కనాలి’ వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయ్యాడు. షూటింగ్‌ సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో వరుణ్‌ అండ్‌ వితికా షెరులు జోడీగా హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హజ్బెండ్‌ అండ్‌ వైఫ్‌గా రోహిత్‌-మెరీనాలు ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ జోడీ ప్రేక్షకుల మనసుల్ని ఎంతవరకు గెలుచుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.

బాలాదిత్య – Baladitya Biography – Bigg Boss Season 6 Telugu Contestants

పదకొండవ కంటెస్టెంట్‌గా హీరో బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్పెషల్‌ ఏవీతో తన గురించి తాను పరిచయం చేసుకున్నాడు. అనంతరం తన సినీ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చాడు. తనకు ఇద్దరు కూతుళ్లు అని, పెద్ద పాపకి బంగార్రాజు సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇక ఇటీవల రెండో పాప పుట్టిందని బాలాదిత్య చెప్పగా.. నాగార్జున అతనికి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. తన రెండో కూతురు ఫోటోని గిఫ్ట్‌గా ఇచ్చి హౌస్‌లోకి పంపాడు.

Baladitya Biography - Bigg Boss Season 6 Telugu Contestants

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్రప్రసాద్‌ కొడుకుగా పిసినారితనం చూపిస్తూ చేసిన బాలాదిత్య నటన అలరించింది.జంబలకిడిపంబ, హిట్లర్‌, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్‌, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలాదిత్య చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 40 సినిమాల్లో నటించగా, హీరోగా జాజిమల్లి, 1940లో ఒక గ్రామం, భద్రాద్రి సహా 10 సినిమాలు చేశాడు. 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు.ఆ తర్వాత యాంకర్‌గానూ గుర్తింపు పొందాడు. బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. లక్ష్మీ మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది.

వాసంతి కృష్ణన్ – Vasanthi Krishnan Biography – Bigg Boss Season 6 Telugu Contestants

12వ కంటెస్టెంట్‌గా వాసంతి కృష్ణన్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘రారా రెడ్డి’ సాంగ్‌తో దుమ్మురేపుతూ.. స్టేజ్ మీదకు వచ్చిన ఆమెను హోస్ట్ నాగ్ సాదరంగా స్టేజ్‌ మీదకు ఆహ్వానించాడు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వాసంతి కృష్ణన్‌ తొలుత కన్నడ సినిమాల్లో నటించింది.సిరి సిరి మువ్వలు సీరియల్‌తో టాలీవుడ్‌కు పరిచయం అయిన వాసంతి ఆ తర్వాత సంపూర్ణేష్ బాబుతో కలిసి క్యాలీఫ్లవర్ సినిమాలో నటించింది.

Vasanthi Krishnan Biography - Bigg Boss Season 6 Telugu Contestants

ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవలె దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడు’ చిత్రంలో నటించింది. ఈమె కెరీర్‌కు బిగ్‌బాస్‌-6 ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది.

షానీ – Shawnee Biography – Bigg Boss Season 6 Telugu Contestants

13వ కంటెస్టెంట్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ అలియాస్ సాల్మన్ వచ్చాడు. తన ఐదుగురు గర్ల్‌ఫ్రెండ్స్ పేర్ల నుంచి తన పేరును షానీగా మార్చుకున్నానని తెలిపాడు. తను ఓ ఫ్రొఫెషినల్‌ ఖోఖో ప్లేయర్‌ అని, నేషనల్‌ లెవల్లో గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించానని చెప్పొకొచ్చాడు. 2003లో తనకు ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి కెరియర్‌కు గుడ్‌బై చెప్పానని చెప్పాడు. అదే సమయంలో రాజమౌళి ‘సై’ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను.

Shawnee Biography - Bigg Boss Season 6 Telugu Contestants

ఆ సినిమాకు సెలెక్ట్‌ అయ్యానని ఫోన్‌ వచ్చిన మరుసటి రోజే తన తల్లి చనిపోయిందంటూ షానీ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక హౌస్‌లోకి వెళ్లే షానీకి చిన్న టాస్క్‌ ఇచ్చాడు నాగ్‌. హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఒక హౌస్‌మేట్‌ను నువ్వు కూడా ఒక సెలబ్రిటీనా అనాలని, అలాగే ఒక హౌస్‌మేట్‌ను చూపించి, అతడు తన వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడని మరో కంటెస్టెంట్‌కు చెప్పాలని నాగ్ కండిషన్ పెట్టారు.

బ్లాక్‌ స్టార్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు షానీ. 2003లో సై సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. స్వతహాగా అథ్లెటిక్‌గా నేషనల్‌ ఛాంపియన్‌ షిప్‌ అందుకున్న షానీ ఆ తర్వాత ఘర్షణ, దేవదాస్‌, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని, అమరన్‌, ‍గ్రే లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. 2021లో వచ్చిన రామ్‌ అసుర్‌ చిత్రంలో శివన్నగా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. మరి బిగ్‌బాస్‌ సీజన్‌-6లో ఎంతవరకు అలరిస్తాడో చూద్దాం.

ఇనయా సుల్తాన – Inaya Sultana Biography – Bigg Boss Season 6 Telugu Contestants

14 కంటెస్టెంట్‌గా రామ్‌గోపాల్‌ వర్మ హీరోయిన్‌ ఇనయా సుల్తాన వచ్చేసింది. ఊ అంటావా? మామా ఉఊ అంటావా అంటూ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. కాంట్రవర్సీ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మతో చేసిన డ్యాన్స్‌ వీడియోతో ఓవర్‌ నైట్‌లో పాపులర్‌ అయ్యింది నటి ఇనయా సుల్తానా.

Inaya Sultana Biography - Bigg Boss Season 6 Telugu Contestants

‘బుజ్జీ ఇలారా’,‘అవ్యోం జగత్‌’ సహా కొన్ని చిత్రాల్లో ఆమె నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తన బర్త్‌డే రోజున ఆర్జీవీతో చేసిన డ్యాన్స్‌ వీడియో అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. దీంతో ఆమెకు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వరించింది. మరి ఈ సీజన్‌లో ఆర్జీవీ ఇనయాకు ఆర్జీవీ సపోర్ట్‌ అందిస్తాడా? లేదా అన్నది చూడాల్సి ఉంది.

ఆర్జే సూర్య – RJ Surya Biography – Bigg Boss Season 6 Telugu Contestants

బిగ్‌బాస్‌లో మరో ఆర్జే వచ్చేశాడు. బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో 14వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య మాస్ లుక్‌తో ‘బిగ్ బాస్’లోకి వచ్చాడు. సుంకర సూర్యనారాయణ అలియాస్‌ కొండబాబు అలియాస్‌ ఆర్జే సూర్య. 1991 ఏప్రిల్‌1న తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన ఆర్జే సూర్య దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి ఆర్జే సూర్యకు మిమిక్రీపై ఆసక్తి ఉండేది. అలా ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో ఆర్జే సూర్య చేసిన మిమిక్రీ గోల్డ్‌ మెడల్‌ వచ్చింది.

RJ Surya Biography - Bigg Boss Season 6 Telugu Contestants

ఇక అప్పటి నుంచి మిమిక్రీపై మరింత ఇష్టం పెంచుకున్న సూర్య ఆ దిశగా కష్టపడేవాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో షోలు చేసి అలరించాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్‌ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు. నటుడిగా, స్క్రిప్ట్‌ రైటర్‌గా, యాంకర్‌గా కొనసాగుతున్నాడు. సుమారు 100మంది హీరోల వాయిస్‌ను మిమిక్రీ చేయగల ఆర్జే సూర్య బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి మరి.

ఫైమా – Bigg Boss Season 6 Telugu Contestant

16వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్‌ కమెడియన్‌ ఫైమా ఎంట్రీ ఇచ్చింది. కమెడియన్‌ ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్లు స్టేజ్‌పైనే ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది ఫైమా. 35 ఏళ్లుగా తమ కుటుంబం రెంట్‌ ఇంట్లోనే ఉంటున్నామని చెప్పింది ఫైమా. కాబట్టి తన ఫ్యామిలీకి ఇల్లు కట్టించడమే తన జీవిత లక్ష్యమని పేర్కొంది.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్‌ ఫైమా. పటాస్‌ షోతో గుర్తింపు పొందిన ఫైమా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనకంటే ఎంతోమంది సీనియర్స్‌ ఉన్నా తనపై బాడీ షేమింగ్ చేస్తున్నా ఫైమా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తుంది. ఈమె వేసే పంచులకు కడుపుబ్బా నవ్వాల్సిందే. తనదైన శైలిలో కమెడీతో అలరించే ఫైమా బిగ్‌బాస్‌ షోలో ఎంత వరకు మెప్పిస్తుందో చూద్దాం.

ఆదిరెడ్డి – Adireddy Biography – Bigg Boss Season 6 Telugu Contestants

17వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌ రివ్యూలతో పాపులర్‌ అయిన ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. నెల్లూరులో ఉదయగిరిలోని వరికుంట‌పాడు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

Adireddy

ఫ్రెండ్‌ సలహాతో ఓసారి సరదాగా బిగ్‌బాస్‌ సీజన్‌-2పై రివ్యూ ఇస్తూ ఓ వీడియోను నెట్టింట అప్‌లోడ్‌ చేయగా ఆ వీడియో పాపులర్‌ అయ్యింది. దీంతో సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి బిగ్‌బాస్‌ షోలపై తనదైన విశ్లేషణతో గుర్తింపు పొందాడు. మరి కామన్‌ మ్యాన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఆదిరెడ్డి బిగ్‌బాస్‌ షోలో ఎలా అలరిస్తాడో చూద్దాం.

రాజశేఖర్‌ – Rajasekhar – Bigg Boss Season 6 Telugu Contestant

18వ కంటెస్టెంట్‌గా మోడల్‌ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు. మనసు మమత సీరియల్స్‌తో పాటు మేజర్‌ సినిమాలోనూ రాజశేఖర్‌ నటించాడు. అంతేకాకుండా ఇతను బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీకి మంచి ఫ్రెండ్‌ అని సమాచారం. మరి ఈ మోడల్‌ రాజశేఖర్‌ బిగ్‌బాస్‌-6లో ఎలా అలరిస్తాడో చూద్దాం.

Rajasekhar - Bigg Boss Season 6 Telugu Contestant

అరోహి రావ్‌ – Arohi Rao Biography – Bigg Boss Season 6 Telugu Contestants

19వ కంటెస్టెంట్‌గా యాంకర్‌ అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. వరంగల్‌కు చెందిన అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచి కష్టాలే కేరాఫ్‌ అడ్రస్‌గా పెరిగానని, సాయం చేస్తూనంటూనే అయితే నాకేంటీ అంటే వెకిలి చూపులు చూసేవారని ఆవేదన ‍వ్యక్తం చేసింది.

Arohi Rao Biography - Bigg Boss Season 6 Telugu Contestants

అనారోగ్యంతో తల్లి చనిపోగా, తండ్రి మరో మహిళను పెళ్లిచేసుకొని వదిలేసి వెళ్లిపోయాడని, దీంతో అమ్మమ్మ దగ్గరే పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇక యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఆరోహి షార్ట్‌ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందింది. ఇస్మార్ట్‌ న్యూస్‌తో పాపులారిటీ దక్కించుకుంది. మరి ఈ చలాకీ చిన్నది బిగ్‌బాస్‌లో ఎలా అలరిస్తుందో చూద్దాం.

రేవంత్‌ – Revanth – Bigg Boss Season 6 Telugu Contestant

20వ కంటెస్టెంట్‌గా ప్రముఖ సింగర్‌ రేవంత్‌ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే నువ్వు మంచి ప్లే బాయ్‌ అటకదా అని నాగార్జున అడగ్గా.. ఈ షో తన భార్య చూస్తుందంటూ ఫన్నీగా బదులిచ్చాడు రేవంత్‌.

Revanth

ముఖ్యంగా తన భార్యను మిస్‌ అవుతున్నానని చెప్పిన రేవంత్‌ ప్రస్తుతం ఆమె 6నెలల గర్భంతో ఉన్నట్లు తెలిపాడు. దీంతో స్టేజ్‌పైకి రేవంత్‌ భార్యను పిలిచి సర్‌ప్రైజ్‌ చేశారు కింగ్‌ నాగార్జున. ఇదిలా ఉండగా బాహుబలిలోని మనోహరీ.. పాటతో పాపులారిటీ దక్కించుకున్నాడు.

Bigg Boss Season 6 Telugu – Full Contestants List – కంటెస్టెంట్స్ వివరాలు

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks