Menu Close

Bhishma Niti: భీష్మ పితామహుడి చెప్పిన ఈ 10 విధానాలను పాటించే వారు జీవితంలో విజయం సాధిస్తారు.


Bhishma Niti: భీష్మ పితామహుడి చెప్పిన ఈ 10 విధానాలను పాటించే వారు జీవితంలో విజయం సాధిస్తారు.

Bhishma Niti: హిందూ ధర్మంలో కర్మ సిద్దంతాన్ని నమ్ముతారు. ఈ భూమి మీద జన్మించిన ఏ జీవి తాము చేసిన కర్మలకు అతీతం కాదు అని.. మనం చేసిన కర్మలకు ఫలితాలను మనమే అనుభవించాలని రామాయణం, మహాభారతంలోని అనేక సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

కురుకుల వృద్ధుడైన భీష్ముడు.. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధ నివారించేందుకు యుద్ధానికి ముందు అనే విషయాలను చెప్పాడు. అయితే మంచి విషయాలను పట్టించుకోకుండా శకుని మాటలు విని యుద్ధానికి సై అన్నాడు దుర్యోధనుడు. కురుక్షేత్రంలో నేలకొరిగిన భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉండి.. రాజుగా, మనిషిగా చేయాల్సిన పనుల గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు.

Bhishma Niti

⮞ ఇతరులు ఇష్టపడే మాటలు మాట్లాడండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, విమర్శించడం, చెడు కోరుకోవడం ఇవన్నీ విడిచి పెట్టండి. ఇతరులను అవమానించడం, అహంకారం, గర్వం అనేవి దుర్గుణాలు.
⮞ త్యాగం లేకుండా ఏదీ సాధించబడదు. త్యాగం లేకుండా అంతిమ ఆదర్శాన్ని సాధించలేము. త్యాగం లేకుండా మనిషి భయం నుంచి విముక్తి పొందలేడు. త్యాగం చేసిన మనిషి అన్ని రకాల ఆనందాలను పొందుతాడు.
⮞ ఆనందాన్ని రెండు రకాల వ్యక్తులు పొందుతారు. అత్యంత మూర్ఖులు ఆనందంగా ఉంటారు.. జ్ఞానం కలిగి.. దాని సారాన్ని తెలిసిన వారు ఆనందంగా ఉంటారు. మధ్యలో వేలాడుతున్న వారు దుఃఖంగా ఉంటారు.

⮞ తన భవిష్యత్తుపై నియంత్రణ ఉన్న వ్యక్తి (తన మార్గాన్ని తానే నిర్ణయించుకుంటాడు, ఇతరుల కీలుబొమ్మగా మారడు), అవసరానికి అనుగుణంగా త్వరగా ఆలోచించి దాని ప్రకారం పనిచేయగలడు. ఆ వ్యక్తి ఆనందంగా జీవిస్తాడు. సోమరితనం మనిషిని నాశనం చేస్తుంది.
⮞ స్త్రీని అవమానించి వారు ఖచ్చితంగా నాశనం అవుతారు. కనుక భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి స్త్రీ గౌరవానికి మొదట ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాడు. స్త్రీ సంతోషంగా ఉండే ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. స్త్రీని గౌరవించని, కష్టాలు పెట్టేవారి ఇంట్లో లక్ష్మి దేవి మాత్రమే కాదు దేవతలు కూడా ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతారు.

⮞ భీష్మ పితామహుడు యుధిష్ఠురుడికి.. నది పూర్తి వేగంతో సముద్రాన్ని చేరుకున్నప్పుడు.. అది తనతో పాటు పెద్ద చెట్లను కూడా సముద్రంలోకి తీసుకుని వెళ్తుంది. ఒకసారి సముద్రం నదిని అడిగింది.. “నీ నీటి ప్రవాహం చాలా వేగంగా, శక్తివంతంగా ఉంది. దీంతో పెద్ద చెట్లు కూడా కొట్టుకుని వచ్చేస్తున్నాయి. అయితే చిన్న గడ్డిని, లేత తీగలను, మృదువైన మొక్కలను ఎందుకు నీ ప్రవాసం తీసుకుని రాలేకపోతుంది. అప్పుడు నది నా నీటి ప్రవాహం వచ్చినప్పుడు.. గడ్డి, తీగలు స్వయంచాలకంగా వంగిపోతాయి.. దీంతో వాటిని సృజిస్తూ నా ప్రవాహం సాగిపోతుంది. అయితే చెట్లు వాటి కాఠిన్యం కారణంగా ఇలా చేయలేవు.. అందుకే నా ప్రవాహం వాటిని భూమి నుంచి పెకిలించి తీసుకువెళుతుందని చెప్పింది.

⮞ మహాభారత యుద్ధానికి ముందు శ్రీ కృష్ణుడు సంధి కోసం హస్తినాపురానికి వచ్చినప్పుడు, భీష్ముడు దుష్ట బుద్ధిగల దుర్యోధనుడికి.. శ్రీ కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుందని.. ఆ వైపు విజయం ఖచ్చితంగా ఉంటుందని వివరించాడు. కనుక నాయనా దుర్యోధనా! శ్రీకృష్ణుని సహాయంతో, నీవు పాండవులతో ఒక సంధి చేసుకోవాలి. ఇది ఒక ఒప్పందానికి చాలా మంచి అవకాశమని చెప్పాడు.

⮞ భీష్మ పితామహుడు కూడా మార్పు ఈ ప్రపంచానికి అనివార్యమైన నియమం అని… దానిని ఎవరూ మార్చలేరు కనుక ఎటువంటి పరిస్థితిలు ఏర్పడినా వాటిని అందరూ అంగీకరించాలని అన్నారు.
⮞ పాలకుడు తన కొడుకు, అతని ప్రజల మధ్య ఎలాంటి వివక్ష చూపకూడదని భీష్మ పితామహుడు చెప్పాడు. ఇది పాలనలో స్థిరత్వాన్ని, ప్రజలకు శ్రేయస్సును అందిస్తుంది.
⮞ భీష్మ పితామహుడు శక్తి అంటే సుఖాలను అనుభవించడానికి కాదు.. కష్టపడి పనిచేయడం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం అని అన్నాడు.

విదుర నీతి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు – 25 Life Lessons from Vidura Neeti in Telugu

యథా పిండే తథా బ్రహ్మాండే – నీలోనే విశ్వం – Proof That Indian Scriptures Understood the Cosmos Long Ago

Share with your friends & family
Posted in Hinduism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading