ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Best Telugu Quotes Text
- గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. అందివచ్చిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటే చాలు. - బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మునుపటికంటే మరింత శక్తిగా, ఉన్నతంగా
మారతాడు. - సాధారణంగా జీవించు … గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను
తెచ్చి పెడుతుంది. - శారీరక దృఢత్వం కంటే మానసిక స్థిరత్వం గొప్పది. దీన్ని సాధించడం పైనే
విజయం ఆధారపడి ఉంటుంది. - జీవితం అనే ఆటలో గెలిచామా? ఓడమా? అని కాదు. ఆట ఆడేటప్పుడు
ఆనందంగా ఆడమా? లేదా? అన్నదే ముఖ్యం. - అపజయం జరిగినదాన్నిబట్టి ఉండదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాన్ని బట్టి ఉంటుంది.
- ప్రతి ఒక్కరినీ మీరు ఎదురు చూసే తీరులోకి మార్చాలని అనుకోకండి.
అంతకన్నా ఎదుటి వాళ్ళను అలాగే అంగీకరించడం నేర్చుకోండి. - ఎవరిపట్ల ప్రతీకారం తీర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో, ఆ వ్యక్తే చాలా
మౌనంగా మీమీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. - దిగులు చెందకుండ, ఉత్సాహం కలిగి ఉండటం ఐశ్వర్యానికి మూలం.
- కష్టాలు బలహీనుడ్ని కుంగదీస్తాయి. బలవంతుడ్ని మరింత అభివృద్ధి పథంవైపు నెట్టుతాయి.
- ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించినప్పుడు పొందేదే అసలైన ఆనందం.
- వాస్తవాల కంటే, ఊహల గురించే తలచుకొని మనుషులు ఎక్కువ కలత
చెందుతారు. - మెరుగుపట్టని వజ్రం ప్రకాశించదు, కష్టాలను ఎదుర్కోని మనిషి రాణించడు.
- జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. అయితే తప్పుకు బాధ్యతను అంగీకరించి సరిదిద్దుకునేవారే విజేతలుగా నిలుస్తారు.
- నువ్వు ఎంచుకున్న దారిని విడువకుండ పయనిస్తున్నప్పుడు ప్రగతి సాధిస్తావు.
- నిజమైన సంపదంటే ధనం కాదు. మనసు ప్రశాంతంగా ఉండటం అని అర్థం.
- సృజనకు మూలం ఆలోచన. నీవు కోరుకున్నది దీని ద్వారానే సాధించగలవు.
- జ్ఞానం లేక పోవటం కన్నా శ్రద్ధలేక పోవటం ఎక్కువ హానికరం.
- ఒత్తిడిలో కూడ ధైర్యంగా ఉండటం ఉన్నతమైన విషయం.
- తాను సరిగా వున్నానని సమర్థించుకోవడం కంటే, తనను తాను సరిగా
వుంచుకో గలిగేలా ఉండగలగటం సరియైున పని. - ధ్యానాన్ని-ఒక పనిగా చేయకు. ప్రతి పనినీ ఒక ధ్యానంగా చేయి.
- నీ పని ఫలితాలపై కాకుండ, ముందు కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు జీవితం
సుఖంగా సాగిపోతుంది. - పనుల మధ్య విశ్రాంతి అంటే- మరో పనిని చేయడమే.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1