Menu Close

Best Telugu Quotes Text Part 8

Best Telugu Quotes Text

  • ఆశావహ దృక్పథం ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. పరిపూర్ణ ఆరోగ్యం పొందిన వారికి అన్నీ సమకూరుతాయి.
  • ఏం చేయాలో చెప్పేది విజ్ఞానం. ఎలా చేయాలో తెలిపేది బుద్ధి కుశలత. అలా
    చేయగలగడం ప్రజ్ఞ.
  • గోరంత విత్తనం నుంచి పుట్టే మొక్క చక్కగా ఎదిగి గోపురమంత చెట్టవుతుంది.
  • మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు
    ఎందుకు పనికిరారు. ఈ ప్రపంచంలో బాధలన్నింటికీ భయమే కారణం.
  • ఇతరులను ద్వేషించటం అంటే నీ సమయాన్ని వృథా చేసుకోవడమే.
  • తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోక పోవడంవల్ల వస్తుంది.
  • చక్కని అవకాశం చేజారిందని అదేపనిగా కుమిలి పోవద్దు. కన్నీళ్ళతో
    మనసబారిన కళ్ళు మరోమంచి అవకాశాన్ని గుర్తించలేవు.
  • నేటి కాలంలో నలుగురితో పాటు అన్నట్లు కాక, వారికన్నా కాస్త మెరుగ్గా
    ఉండడానికి ప్రయత్నించాలి.
  • ఈ రోజు నువ్వు చేస్తున్న పని – రేపటి నీ గమ్యానికి నిన్ను దూరంగానో,
    దగ్గరగానో తీసుకెళ్తుంది.
  • వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా! ఆలోచనా విధానమే మూలం.
  • ఏదీ శాశ్వతం కాదు. ఎదుగుదల బాహ్యంగానే కాదు, అంతర్ముఖంగానూ ఉండలి.
  • ఆలోచన నుండి ఆచరణలు. ఆచరణలనుండి అలవాట్లు. అలవాట్లనుండి మేలైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వమే భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది.
  • ఒక మంచి పుస్తకం మనలో దాగి ఉన్న శక్తులను మేల్కొల్పడనికి
    దోహదపడుతుంది.
  • కరుణ కలవాడు తన శక్తి సంపదలనే కాక అవసరాన్ని బట్టి తనని తననే ఇచ్చుకుంటాడు.
  • అపారమైన ఆలోచనలు ఎన్ని ఉన్నా వ్యర్థమే – అవి అనుసరించి అమలు పరచనప్పుడు.
  • మంచిమాటలు ఎంత ఎక్కువ చెప్పినా వాటిని గ్రహించేది అది కొద్దిమందే.
  • తల్లిదండ్రులకు సేవ చేయటం వల్ల ఋణమైతే తీరదు కాని, కనీసం కృతజ్ఞతైనా చూపించినట్లవుతుంది.
  • కోపం మానవ సహజం. కానీ, దాన్ని ఏ సమయంలో ఉపయోగించాలో
    తెలుసుకోవటమే విజ్ఞత.
  • సంతోషంగా ఉన్నావంటే నీ వెంటే ప్రపంచం ఉంటుంది. దుఃఖంలో ఉన్నావంటే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు.
  • తెలియనిది అడిగితే బయటపే అజ్ఞానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం
    అజ్ఞానంతోనే మిగిలిపోతారు.
  • నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, ఆ కారణంగా ఇతరులకు హాని చేయవద్దు.
  • ఎలాంటి దాని మీదైనా ద్వేషం లేనివారే ఆనందంగా జీవిస్తారు.
  • ఎవరైనా సరే తమ తెలివితేటలను మంచి పనులకు ఉపయోగిస్తే సమాజానికి
    మేలు జరుగుతుంది. చేసిన వాళ్ళకు గౌరవం కలుగుతుంది.

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks