అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Best Telugu Quotes Text
- ఆశావహ దృక్పథం ఉన్నవారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. పరిపూర్ణ ఆరోగ్యం పొందిన వారికి అన్నీ సమకూరుతాయి.
- ఏం చేయాలో చెప్పేది విజ్ఞానం. ఎలా చేయాలో తెలిపేది బుద్ధి కుశలత. అలా
చేయగలగడం ప్రజ్ఞ. - గోరంత విత్తనం నుంచి పుట్టే మొక్క చక్కగా ఎదిగి గోపురమంత చెట్టవుతుంది.
- మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు
ఎందుకు పనికిరారు. ఈ ప్రపంచంలో బాధలన్నింటికీ భయమే కారణం. - ఇతరులను ద్వేషించటం అంటే నీ సమయాన్ని వృథా చేసుకోవడమే.
- తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోక పోవడంవల్ల వస్తుంది.
- చక్కని అవకాశం చేజారిందని అదేపనిగా కుమిలి పోవద్దు. కన్నీళ్ళతో
మనసబారిన కళ్ళు మరోమంచి అవకాశాన్ని గుర్తించలేవు. - నేటి కాలంలో నలుగురితో పాటు అన్నట్లు కాక, వారికన్నా కాస్త మెరుగ్గా
ఉండడానికి ప్రయత్నించాలి. - ఈ రోజు నువ్వు చేస్తున్న పని – రేపటి నీ గమ్యానికి నిన్ను దూరంగానో,
దగ్గరగానో తీసుకెళ్తుంది. - వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా! ఆలోచనా విధానమే మూలం.
- ఏదీ శాశ్వతం కాదు. ఎదుగుదల బాహ్యంగానే కాదు, అంతర్ముఖంగానూ ఉండలి.
- ఆలోచన నుండి ఆచరణలు. ఆచరణలనుండి అలవాట్లు. అలవాట్లనుండి మేలైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వమే భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది.
- ఒక మంచి పుస్తకం మనలో దాగి ఉన్న శక్తులను మేల్కొల్పడనికి
దోహదపడుతుంది. - కరుణ కలవాడు తన శక్తి సంపదలనే కాక అవసరాన్ని బట్టి తనని తననే ఇచ్చుకుంటాడు.
- అపారమైన ఆలోచనలు ఎన్ని ఉన్నా వ్యర్థమే – అవి అనుసరించి అమలు పరచనప్పుడు.
- మంచిమాటలు ఎంత ఎక్కువ చెప్పినా వాటిని గ్రహించేది అది కొద్దిమందే.
- తల్లిదండ్రులకు సేవ చేయటం వల్ల ఋణమైతే తీరదు కాని, కనీసం కృతజ్ఞతైనా చూపించినట్లవుతుంది.
- కోపం మానవ సహజం. కానీ, దాన్ని ఏ సమయంలో ఉపయోగించాలో
తెలుసుకోవటమే విజ్ఞత. - సంతోషంగా ఉన్నావంటే నీ వెంటే ప్రపంచం ఉంటుంది. దుఃఖంలో ఉన్నావంటే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు.
- తెలియనిది అడిగితే బయటపే అజ్ఞానం కొద్దిసేపే. అడగకపోతే జీవితాంతం
అజ్ఞానంతోనే మిగిలిపోతారు. - నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, ఆ కారణంగా ఇతరులకు హాని చేయవద్దు.
- ఎలాంటి దాని మీదైనా ద్వేషం లేనివారే ఆనందంగా జీవిస్తారు.
- ఎవరైనా సరే తమ తెలివితేటలను మంచి పనులకు ఉపయోగిస్తే సమాజానికి
మేలు జరుగుతుంది. చేసిన వాళ్ళకు గౌరవం కలుగుతుంది.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1