- నిజాయితీ గల ధైర్యవంతులకు క్షమాగుణం ఉంటుంది.
- నీవు కావాలనుకున్నది సాధించుకోవాలనుకుంటే నీలో ఉన్న శక్తిని నీవు
విశ్వసించాలి. - ప్రపంచంలో పైకి వచ్చిన ప్రతివారూ, కలలు గని ఆ కలలని నిజం చేసుకోవడనికి శ్రమించినవారే.
- ఇవ్వగలిగిన దానికంటె ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటె
తక్కువ తీసుకోవడం గౌరవం. - ఇతరులను మార్చాలని అందరూ అనుకుంటారు. కానీ వారిని వారు
సంస్కరించుకోవటం మాత్రం చేయరు. - ప్రతిరోజు మనిషికి ఓ కొత్త అవకాశం. గతాన్ని దిద్దు కోవడనికి, వర్తమానాన్ని
మెరుగుపరచుకోవడనికి. - జీవితంలో కావలసింది నిజమైన తపన. ఆందోళన కాదు.
- మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి
సాధించవలసిన విజయం. - తన ఆశలకు తన శక్తిసామర్థ్యాలకు మధ్య నున్న అగాధాన్ని అర్థం చేసుకున్నవాడు సుఖ పడతాడు.
- చేదు గతాన్ని తవ్వుకునే కన్నా, తీపి భవిష్యత్తుకు ప్రణాళిక వెయ్యి.
- మోసాలన్నిటిలోకి ఆత్మవంచనను మించిన మోసం మరొకటి లేదు.
- యుక్త వయస్సులో బాధ్యతగా ఉండనివాడు, వృద్ధాప్యంలో ఇబ్బందులు పతాడు.
- మనలో ఆవగింజంత ఆత్మవిశ్వాసం వుంటే చాలు, విశ్వాన్నే జయించవచ్చు.
- ప్రతివాళ్ళు తాము చేయవలసిన తమ పనిని బాధ్యతగా చేసుకుంటూపోతే ఈ
ప్రపంచం ఇంతకన్నా చాలా వేగంగా ముందుకెళ్ళకలుగుతుంది. - కాలాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి, జీవితాన్ని అపార్థం చేసుకోలేడు.
- ఎప్పుడూ నవ్వుతూనే ఉండగలిగితే అప్పుడు ఈ ప్రపంచంలో నీకన్నా అందమైన వారు మరొకరు ఉండరు.
- తనకు దక్కింది మాత్రమే-తనది దక్కలేదంటే – అది తనది కాదన్నమాట. దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనిషికి ఆనందం లభిస్తుంది.
- నువ్వు ఉత్సాహాంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది.
ఎప్పుడూ పడుకుని ఉంటే నీ చాపనే నిన్ను ఏవగించుకుంటుంది. - ఉన్నతమైన ఆలోచనలు చేయడమే గొప్పకాదు. వాటిని సాధించేవరకు కృషిని
విడవని వారే గొప్పవారు. - కష్టంగా భావించే దాన్ని సాధించడం ‘నేర్పు’. అసాధ్యంగా భావించే దాన్ని
సాధించడం ‘ప్రతిభ’. - తెలివితేటలు, సామర్థ్యం ఉన్నా సాధించాలన్న తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే.
- దానం చేస్తున్నాననే అహాన్ని విడిచి దానం చేయడం నేర్చుకో.
- జ్ఞానంతో బుద్ధి శుభ్రపడుతుంది. దానంతో పవిత్రమవుతుంది. ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది.
- ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే రేపటిని నవ్వుతూ ఆహ్వానించగలుగుతాం.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.