టాప్ 10 తెలుగు కోట్స్ – Best Telugu Quotes Text Part 19
ధనం ఉన్నవారందరికీ దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారికి తగినంత ధనం ఉండకపోవచ్చు.
మనం ఇష్టంగా చేసే పనికి సమయం లేకపోవడం అంటూ ఉండదు.
ప్రతి వ్యక్తీ తన విద్యుక్తధర్మాన్ని తాను త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తుండలి. సుఖ దుఃఖాలు రెండిటిలోనూ సమాన బుద్ధిని కలిగి ఉండలి. అదే ఉత్తమ యోగం. దీనిని సాధించినవాడు ఉత్తమయోగి.
తప్పు చేసారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు.
ఎక్కడ నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
ఆత్మగౌరవం, ఆత్మనిగ్రహం, ఆత్మజ్ఞానం అనే మూడు అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.
సముద్రపు కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు. పడినా లేస్తున్నందుకు.
ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా. . . విలువలతో జీవించే వ్యక్తి మిన్న.
ఇతరుల గురించి మంచిగా మాట్లాడితే నిన్ను గురించి మంచిగా మాట్లాడుకున్నట్టే.
వెన్న కరిగితే వేడికి నిదర్శనం – మనసు కరిగితే మానవతకు నిదర్శనం.