అందరినీ ప్రేమించు, కొందరినే నమ్ము, ఎవరికీ హాని చేయకు.
వందమందికి నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, కనీసం ఒక్కరికైనా సహాయపడు.
రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికీ పరిపూర్ణత సాధించలేడు.
గతాన్ని మరచిపో, ప్రస్తుతం నీ ముందున్న కర్తవ్యాన్ని గురించే ఆలోచించు.
కలసిరావటం ఆరంభం, కలసి ఉండలని నిశ్చయించుకోవడం ప్రగతికి చిహ్నం, కలసి పనిచేయడం విజయానికి సోపానం.
పనిలోనే ఆనందించేవానికి ఫలితంపై ఆలోచన ఉండదు.
హడవిడి వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇది ఉన్నవారు ఎప్పటికైనా నష్టపోతారు.
ప్రతీ వైఫల్యం మనల్ని విజయానికి మరింత చేరువ చేస్తుంది.
ఒకే పుస్తకాన్ని ఎందరో చదువుతారు. కాని కొందరే దానిలోని మంచివల్ల ప్రభావిత మవుతారు.
విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగిన పరిజ్ఞానం కలిగినవాడే, నిజమైన నాయకుడు.
ధైర్యం ఉంటే దేనినైనా సాధించవచ్చు. అయితే ఆ ధైర్యానికి ఆత్మవిశ్వాసం తోడవ్వాలి.
ఇతరులకు ఎంత సహాయం చేసావో లెక్కించక పోవడమే నీలో వున్న గొప్ప లక్షణం.
ఈ ప్రపంచంలో మీరొక్కరే మీలా ఉన్నారు. ఆత్మవిశ్వాసానికి తొలిమెట్టు ఇదే.
ఇతరులు విమర్శిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించు.. ఇతరులు సంశయిస్తున్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో… ఇతరులు వాయిదా వేస్తున్నప్పుడు నువ్వు బాగా పని చెయ్యి.
ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులుంటాయి. ప్రతి అడ్డంకి వెనుకా కొన్ని అవకాశాలుంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం.
జీవితంలో మనం ఎంత సంపాదించాం, ఎంత పోగేశాం అన్నది కాదు. మన ద్వారా పదిమందికి ఎంత పంచాం అన్నది ముఖ్యం. అది మనం ఎటువంటి బతుకు బతికామో, బతుకుతున్నామో నిర్దారించేదీ, నిగ్గు తేల్చేది!
తాము అనుసరించలేని మంచితనాన్ని చూసి ప్రతి వ్యక్తి భయపతాడు.
మీరు మరొకరి జీవితాన్ని బాగుపరచాలని ప్రయత్నిస్తే చాలు – మీ జీవితమూ బాగుపడుతుంది.
మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి.
జీవితంలో మీకు సంభవించిన విషయాలను గురించి కాకుండ, మీరు చేయగలిగిన విషయాలను గురించే ఎక్కువగా ఆలోచించండి.
అన్వేషణ ఆపకండి. అన్వేషించిన కొద్ది కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి.
ఇతరుల కష్టాలలో పాలు పంచుకునే వారికి నిజమైన మిత్రులు లభిస్తారు.