Menu Close

ఆనందంగా జీవించు – Best Stories in Telugu


ఆనందంగా జీవించు – Best Stories in Telugu

18 సంవత్సరాలు పైబడిన వారు చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే
వారికే ఇది బాగా అర్థం అవుతుంది……తెలుసుకోవాలి కూడా……
దయచేసి చదవండి…………ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే మంచిదని
నా ఆభిప్రాయం…….

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

ఉదయం 6 గంటల సమయం…….ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం
చేస్తున్నాను. కానీ……లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి……
” ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? ” ఒక్క నిమిషం ఆలోచించాను.
నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత
నొప్పి వచ్చింది…స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు
తెలియదు…..

కాఫీ కావాలి నాకు……..నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?
వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు…….ఇంటి బయట చాలా మంది గుంపుగా
ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు……అయ్యో! అది నేనే! దేవుడా!
నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు…..బిగ్గరగా
పిలిచాను……..నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి
నా పక్కగదిలోకి తొంగి చూశాను…. నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.
కొడుకును పట్టుకుని…….భార్యను పిలిచాను……..తనకు నా మాటలు
వినిపించలేదు……..మరో గదిలోకి వెళ్ళి చూశాను……
ఆ గదిలో మా అమ్మ …నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు
దు;ఖంలో…….

“నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ” అని బిగ్గరగా అరిచాను…….ఎవ్వరూ నన్ను
చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను…….అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా
ఏడుస్తున్నాడు…..వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు…….
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి………..వాడితో సంవత్సరం నుండి నేను
మాట్లాడ్టం మానేశాను…….ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి
వాడెందుకు ఏడుస్తున్నాడు………అవును నేను చనిపోయాను……నిజంగానే
చనిపోయాను.

దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని
ఇవ్వు…..ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా
ప్రేమగా చూసుకోలేకపోయాను…..నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..
నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను……..
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను……నేను వచ్చేలోగానే నా
బిడ్డ నిద్రపోయేవాడు……

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను
చూడలేకపోతున్నాను……..చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని
వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను.” అని బి్గ్గారగా
ఏడుస్తున్నాను…….” దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు……నా తల్లి
మొహంలో నవ్వును చూడాలి………నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు
ప్రాణబిక్ష పెట్టు స్వామీ! “

ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు……కళ్ళు తెరిచి చూశాను.
నా భార్య……” ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.
ఏమైంది మీకు ?” అని అడుగుతోంది.

అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
” నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని…..నీలాంటి అమ్మాయి నాకు
భార్యగా దొరకడం……నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా
ఉన్నావో తెలుసా ? ” అన్నాను……

ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,
మిత్రులారా! మీకు ఇంకా చాలా సమయం ఉంది… మీ ఈగో లను
పక్కనపెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి….అన్నీ పోగొట్టుకున్నతర్వాత
బాధపడి ఏమీ లాభం లేదు……కుటుంబంతో గడపండి………స్నేహితులతో
మంచిగా ప్రవర్తించండి……ఈ జన్మ దేవుడిచ్చినది……ఆనందంగా
జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా
మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!

ఇంత ఓపిగా చదివిన మీకు ధన్యవాదములు నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

మీ..చిన్న….✍️

Best Stories in Telugu

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చెయ్యండి.

అతి పెద్ద కవితలు ప్రపంచం – https://kavithalu.in/

Share with your friends & family
Posted in Telugu Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading