ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రతి అభిప్రాయానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు – Best Stories in Telugu
అప్పుడే స్నానం చేసిన ఏనుగు నడుస్తూ ఒక వంతెన దగ్గరకు చేరింది. ఆ వంతెన మీద బురదలో పొర్లిన ఓ మురికి ఓడుతన్న పంది నడిచి వస్తోంది. ఏనుగు దానికి దారిచ్చి పక్కకు తప్పుకొని, తరవాత వంతెన దాటింది.
ఆ మురికి పంది పొగరుగా స్నేహితులతో, “చూడండి! నేనెంత గొప్ప దాన్నో! ఏనుగు కూడా నన్ను చూసి భయపడి, గౌరవంగా పక్కకు తప్పుకొని దారి ఇచ్చింది. కొన్ని ఏనుగులు ఈ ఏనుగు, పందికి దారి ఇచ్చిందని తెలిసి “అలా ఎందుకు చేసావని” ఏనుగును నిలదీసాయి.
ఏనుగు నవ్వుతూ, “ఆ పందిని ఒక్క తొక్కు తొక్కితే నలిగి చస్తుంది.. కానీ దాని మురికి, బురద అంటించుకోవడం అవసరమా! అందుకే పక్కకు తప్పుకొన్నాను” అంది.
అన్ని తెలిసిన వాళ్లు నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలనుకుంటారు. భయంతో కాదు, ఆ మురికి, బురద ఎందుకు అంటించుకోవాలని.
ప్రతి అభిప్రాయానికి, వ్యాఖ్యకు, పరిస్థితికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన సామెత ఉంది కదా, “ఏనుగు దారిన పోతుంటే
కుక్కలు మొరుగుతుంటాయని”
సేకరణ – V V S Prasad