Menu Close

మ్యూజిక్ ప్రియులకి మంచి ఇయర్ బడ్స్
తక్కువ బడ్జెట్ లో అమెజాన్ ఆఫర్ 👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Moral Stories – గొప్ప పాఠాన్ని నేర్పి పోతున్నావు

Telugu Moral Stories – గొప్ప పాఠాన్ని నేర్పి పోతున్నావు

కొడుకు వృద్ధుడైన తన తండ్రిని, ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. తండ్రి బాగా వృద్ధుడు, బలహీనుడు అయినందువల్ల, ఆహార పదార్థాలను సరిగా తినలేక, షర్టు మీద, ప్యాంటు మీద పోసుకుంటున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఆ తినడాన్ని చూడడం అసహ్యంగా కనిపించింది. కొడుకు మాత్రం ప్రశాంతంగా, తండ్రికి నెమ్మదిగా అన్ని పదార్థాలు తినిపించాడు.

old man telugu stories

తండ్రి తినడం పూర్తైన తర్వాత, ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ చెయ్యి పట్టుకొని వాష్ బేసిన్ వరకు తీసుకెళ్లి. మూతికీ, ముఖానికి అంటుకున్న ఆహారపు ముక్కలను తుడిచి, చొక్కా మీద పడ్డ మరకలను కూడా శుభ్రపరిచి, తండ్రి కళ్లద్దాలను సరిచేసి, బిల్లు చెల్లించడానికి కౌంటర్ దగ్గరకు నడిచాడు.

హోటల్లో తింటున్న వాళ్ళంతా ఆ తండ్రీ కొడుకులను సంభ్రమాశ్చర్యాలతో నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. కొడుకు బిల్లు కట్టేసి బయటకి తండ్రిని నడిపించుకొని – వెళ్ళబోయాడు. అక్కడ అంతమంది మధ్య నుండి ఒక పెద్ద మనిషి ఆ అబ్బాయిని ఉద్దేశించి, “నాయనా! నీకు తెలుసా నీవు ఇక్కడ ఒక ముఖ్యమైన దానిని వదిలిపెట్టి పోతున్నావని” అన్నాడు.

“లేదండీ నేనేం మరిచిపోలేదే!” అన్నాడు అబ్బాయి. ఆ పెద్దమనిషి. ” నువ్వు ఇక్కడ ఒక గొప్ప సందేశాన్ని వదిలి పోతున్నావు. ప్రతి కొడుకు కూతురుకు నీవు ఒక గొప్ప పాఠాన్ని నేర్పి పోతున్నావు. అంతేకాదు వృద్ధులైన తల్లిదండ్రులకు తమపట్ల తమ పిల్లల ప్రవర్తన ఎలా ఉండాలని కోరుకుంటారో ఆ ఆశను కలిగించి పోతున్నావు.”

సేకరణ – V V S Prasad

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు,

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks