ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నన్ను ఇటువంటి జైళ్ళు కట్టిపడేయలేవు – Best Stories in Telugu
ఒక వ్యక్తిని ఏదో తప్పు చేసాడన్న అనుమానంతో, ఆ దేశపు రాజు జైల్లో పడేయించారు. ఒక భటుడు ఆ ఖైదీని భూగృహంలో ఉన్న చీకటి గదిలో పడేసి ధనామని ఇనుప తలుపులు వేసేసాడు. ప్రతిరోజూ ఓ భటుడు తిండి, ముంతలో నీళ్ళు ఇచ్చి తలుపులు వేసుకుని పోయేవాడు.
ఈ విధంగా ఎన్నో ఏళ్లు గడిచి పోయాయి. జైలు జీవితాన్ని భరించలేక ఖైదీ చచ్చిపోవాలని అనుకున్నాడు. ఆహారం తెచ్చే భటుడి మీద దాడి చేస్తే ఆత్మరక్షణ కోసం భటుడే చంపేస్తాడలే అని అనుకున్నాడు. ఒక్కసారి చూద్దామని జైలు తలుపులు తోసాడు. భళ్ళున తెరుచుకున్నాయి. వాటికి తాళాలే లేవు. ‘ఇన్నాళ్లు ఈ తాళాలు లేని జైల్లో ఉండిపోయానా అని ఆశ్చర్యపోయాడు.
తెరుచుకున్న తలుపుల నుండి బయటకి వచ్చాడు. ఆ చీకటి దారి వెంట నడిచాడు, ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఆపలేదు. నడుస్తూ ఇంటికి వెళ్ళి పోయాడు. “ఇన్నేళ్లు ఈ ఊహాజనితమైన, అబద్ధపు జైల్లో మగ్గిపోయానా” అని దిగ్భ్రాంతి చెందాడు.
ఒక విధంగా చూస్తే మనం కూడా కోపం, ఆగ్రహం, వ్యాకులత, పాశ్చాత్తాపం వంటి భావాల మధ్య బందీలుగా ఉండి పోతాం . అంటే జైలు మన ఆలోచనల్లోనే ఉంది. “నేను కచ్చితంగా బయట పడాలి, నన్ను ఇటువంటి జైళ్ళు కట్టిపడేయలేవు” అనే బలమైన కోరిక ఉంటే, కొత్త జీవితంలోకి స్వేచ్ఛగా రాగలరు.
సేకరణ – V V S Prasad