ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
మీ అభివృద్ధిని అడ్డుకునే సామర్థ్యం మీ ఒక్కరికే ఉంది – Best Stories in Telugu
ఒక రోజు ఉద్యోగులందరూ ఆఫీస్ కు వెళ్లేసరికి తలుపు మీద ఉన్న నోటీసులో, “ఈ సంస్థలో ఇన్నాళ్లూ మీ అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి నిన్ననే చనిపోయాడు. వ్యాయామశాలలో ఆ వ్యక్తి పార్థివదేహం ఉంది, వెళ్లి చూడవచ్చు” తమ సహోద్యోగి ఎవరో మరణించారన్న వార్త వారిని బాధపెట్టింది. ‘ఎవరా’ అని కుతూహలం కలిగింది.
తమ అభివృద్ధికి, కంపెనీ ఎదుగుదలకు అడ్డుపడ్డ వ్యక్తిని తెలుసుకోవాలన్న కోరికతో వ్యాయామశాలకి చేరుకున్న ఉద్యోగుల్లో ఉద్వేగం, ఉత్సుకత పెరిగిపోయాయి. ‘నా అభివృద్ధికి అడ్డుపడింది ఎవరు, పోనీలే అతనుచనిపోయాడు కదా’ అని మనసులో ఆనందపడ్డారు. శవపేటికలోకి తొంగి చూసిన ఉద్యోగులకు నోట మాట రాలేదు.
దిగ్భ్రాంతికి లోనయ్యారు. మౌనంగా ఉండిపోయారు. శవపేటికలో ఒక అద్దం ఉంది… దాని లోకి తొంగి చూసిన వాళ్లకి వాళ్ల ప్రతిబింబమే కనిపించింది అద్దం పక్కనే ఒక కాయితం అతికించి ఉంది.
“మీ అభివృద్ధిని అడ్డుకునే సామర్థ్యం మీ ఒక్కరికే ఉంది. మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చుకోగల వ్యక్తి మీరే. మీ ఆనందాన్ని, విజయాన్ని, స్వశక్తిని ప్రభావితం చేయగల వ్యక్తి కూడా మీరొక్కరే. ఇంకా మీకు మీరు సహాయం చేసుకో గల ఒకే ఒక వ్యక్తి మీరే. మీలో మార్పు వస్తేనే మీ జీవితంలో మార్పు వస్తుంది. మీ జీవితానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి మీరొక్కరే…”
సేకరణ – V V S Prasad