Menu Close

Best Stories in Telugu – దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది.


Best Stories in Telugu

తాజా పళ్లు తీసుకుందామనుకున్న నాకు రద్దీ గా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఓ పళ్ళ దుకాణం కనపడింది, దుకాణం లో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి, కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనడలేదు, పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది, దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది, కుతూహలం తో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూసాను,

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

దానిమీద “అయ్యా! నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది, కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బు ను ఈ గళ్ళా పెట్టె లో వేయగలరు అని ఉంది.. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈకాలం లో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా? అని,

దొంగలు ఆ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది, ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకునుటకు దుకాణం కు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణం కు చేరుకున్నాను, పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకుని దుకాణం కట్టి వేస్తున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా?

ఎవరైనా దొంగలు నీ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఎలా? పళ్ళ ను ఊరికే తీసుకుపోతే ఎలా? అని మందలించబోయాను, అందుకు అతను చిరునవ్వుతో” అంతా దైవేచ్ఛ ” అన్నాడు మళ్ళీ అతనే అయ్యా! మొదట్లో నేను నా తల్లి గారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా? అని, అందుకు మా అమ్మ “నాయనా! నాకు రోజులు దగ్గర పడ్డాయి, రోజూ నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవున్ని ప్రార్ధిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చేయి, అని చెప్పింది, అమ్మ చెప్పినట్టుగానే ఆరోజు నుండి ఈవిధంగా చేస్తున్నాను అన్నాడు, మరి నీకు ఏనాడూ నష్టం రాలేదా? అని అడిగాను కుతూహలం ఆపుకోలేక..

అతను అదే చిరునవ్వుతో “నష్టమా??? ఒకసారి ఈ గల్లా పెట్టె ను చూడండి అని అతని గల్లాపెట్టె ను తెరచి చూపించాడు, ఆశ్చర్యం! గల్లాపెట్టె నిండా డబ్బు! దుకాణం లోని పళ్ళ విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది, ఇవి చూడండి అని దుకాణం లో రకరకాల వస్తువులు చూపాడు.. వాటిలో చీరలు, బట్టలు,స్వెట్టర్లు,అప్పుడే వండుకుని తెచ్చిన పులావు, రకరకాల తినుబండారాలు…. అన్నింటిపైన “భయ్యా! అమ్మీ జాన్ కు మా తరపున ఇవ్వండి” అని రాసిన కాగితాలు ఉన్నాయి.అంకుల్ అమ్మను నా ఆసుపత్రి కి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డు ను ఓ కాగితానికి కట్ఠి దుకాణం లో వ్రేలాడదీసి వెళ్ళాడు..

fruits telugu stories

ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు, సమాజమంతా స్వార్థం తో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది, సమాజం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది, ముందు మన దృక్పథం లో మార్పు రావాలి, తల్లికి సేవచేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణం కు కాపలా కాస్తున్నాడు..

నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

Share with your friends & family
Posted in Telugu Stories

Subscribe for latest updates

Loading