అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Best Health Insurance Policies in Telugu – India
ఆరోగ్యమే మహా భాగ్యము – మద్యతరగతి కుటుంబాలకి కచ్చితంగా అవసరం ఈ health insurance policy ఎందుకంటే, నిదానంగా రూపాయి రూపాయి కూడపెట్టుకుని సొంత ఇల్లు కునుకుందామో లేదా పిల్లలకి పెళ్లి చేద్దామో అని చూస్తారు, ఈ లోగా దురదృష్టం కొద్ధీ ఏదో ఒక ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. దాచుకున్న డబ్బు అంతా అయిపోతుంది. పైగా కొన్ని సార్లు మనం దగ్గర లేనంత డబ్బు అవసరం అవుతుంది. మన చెయ్యి దాటిపోయే పరిస్తితులు అవి. ఇలాంటి పరిస్తితి రాకుండా వుండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మంచిది. ఇక్కడ కొన్ని రకాల పాలసీల గురుంచి చూద్ధాము.
![telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes Best Health Insurance Policy in Telugu](https://telugubucket.com/wp-content/uploads/2022/02/Best-Maternity-Health-Insurance-Plans-In-India.jpg)
Star Family Health Optima Plan:
కుటుంబంలోని అందరికీ పాలసీ కవరేజ్ లభిస్తుంది. మార్కెట్‌లో అందుబాటు ధరలో లభ్యమౌతున్న మోస్ట్ ఆఫర్డబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది. పుట్టబోయే బిడ్డకు కూడా పాలసీ వర్తిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు కవరేజ్‌తో పాలసీ తీసుకోవచ్చు. 16 రోజుల చిన్న పిల్లల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురైతే అప్పుడు పాలసీ మొత్త ఆటోమేటిక్‌గానే 25 శాతం వరకు పెరుగుతుంది. దీనికి ఎలాంటి అదనపు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ గ్రేస్ పీరియడ్ 120 రోజులు.
Religare Care Health Insurance Plan
కుటుంబ సభ్యులందరికీ ఈ ప్లాన్ వర్తిస్తుంది. రూ.4 లక్షల నుంచి రూ.6 కోట్ల వరకు బీమా మొత్తానికి ఈ పాలసీ తీసుకోవచ్చు. జీవితాంతం పాలసీ వర్తిస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఐసీయూ, రూమ్ రెంట్ చార్జీలు, డేకేర్ ఎక్స్‌పెన్సెస్, హాస్పిటల్ అడ్మిషన్‌కు 30 రోజుల ముందు వరకు చేయించిన టెస్ట్‌లకు కూడా పాలసీ కవరేజ్ లభిస్తుంది. ఆయుర్వేద, యునాని, హోమియోపతి వంటి ట్రీట్‌మెంట్లకు కూడా పాలసీ వర్తిస్తుంది. ఆర్గాన్ డోనర్ కవర్, అంబులెన్స్ కవర్ వంటివి కూడా పాలసీలో కవర్ అవుతాయి.
Max Bupa Health Companion Individual Plan
రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు కవరేజ్‌కు పాలసీ తీసుకోవచ్చు. 90 రోజుల వయసు ఉన్న పిల్లల దగ్గరి నుంచి ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. రూమ్ రెంట్‌పై ఎలాంటి పరిమితి ఉండదు. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. హాస్పిటల్‌లో ఒకవేళ బీమా మొత్తం పరిమితి దాటితే అప్పుడు రిఫిల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే అదనపు ప్రీమియం చెల్లింపు ద్వారా పాలసీ మొత్తాన్ని మళ్లీ పొందొచ్చు. ప్రత్యామ్నాయ ట్రీట్‌మెంట్స్‌కు కూడా పాలసీవర్తిస్తుంది.
Apollo Munich Optima Restore Plan
ప్రి-హాస్పిటలైజేషన్ నుంచి పోస్ట్-హాస్పిటలైజేషన్ వరకు దాదాపు అన్ని ఖర్చులకు ఈ పాలసీ వర్తిస్తుంది. పాలసీలో రిస్టోర్ బెనిఫిట్ ఉంటుంది. ఫాస్ట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్, మెడికల్ ఎక్సెపెన్సెస్ రీయింబర్స్‌మెంట్ వంటివి కంపెనీ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బీమా కరేజ్ పొందొచ్చు. 91 రోజుల పిల్లల నుంచి 65 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఏడాది కాకుండా రెండేళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. 7.5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
![telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes Best Health and Life Insurance Policy in Telugu](https://telugubucket.com/wp-content/uploads/2022/02/insure-1024x683.jpg)
HDFC ERGO Health Suraksha Gold Plan
హెచ్‌డీఎఫ్‌సీ ఆ పాలసీ అందిస్తోంది. మెంటల్ హెల్త్‌కేర్, హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్, ఎయిర్ అంబులెన్స్ సహా ఇతర వైద్య ఖర్చులకు ఈ పాలసీ వర్తిస్తుంది. రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. వయసు పరిమితి అంటూ ఏమీ లేదు. ఎవరైనా పాలసీ పొందొచ్చు. దేశంలో 6000కు పైగా హాస్పిటల్స్‌లో ఈ పాలసీతో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. బోనస్ ఫెసిలిటీ ఆప్షన్ ఉంది.
మీ అవగాహన కోసం కొంచెం సమాచారం ఇక్కడ పొందు పరచడం జరిగింది, పాలసీ తీసుకునే ముందు సంబంధిత వారిని కలిసి పూర్తి వివరంగా తెలుసుకుని పాలసీ తీసుకోవడం మంచిదని మనవి.