ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Importance of Insurance Policy and Insurance Policy Types in Telugu
మనలో చాలా మందికి భీమా యుక్క ప్రాముఖ్యత మరియు దాని అవసరం తెలియదు, నిజానికి మద్య తరగతి కుటుంబాలకి ఈ ఇన్సూరెన్స్ పాలసీ యుక్క అవసరం చాలా వుంటుంది. ఈ మద్య కాలంలోనే బీమా అవసరం ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. అయితే బీమా పాలసీల్లో చాలా రకాలుంటాయి, బీమా పాలసీల గురుంచి తెలుసుకుని ఎటువంటి పాలసీ మనకు అవసరం వుంటుందో అదే తీసుకోవడం మంచిది. ఇక్కడ కొన్ని రకాల insurance policy ల గురుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్ధాము.
Term Insurance Policy – టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ
ఈ బీమా పాలసీ యుక్క ముఖ్య ఉద్దేశం పాలసీదారు మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం. ఈ విధంగా చూస్తే కుటుంబానికి సంపూర్ణ రక్షణ కల్పించేవే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఈ పాలసీలు పాలసీదారుకు గరిష్ట రక్షణ కల్పిస్తాయి. అయితే పాలసీ కాలపరిమితి మొత్తం పాలసీదారు జీవించి ఉన్నట్లయితే దక్కే ప్రయోజనాలు స్వల్పం. పాలసీ కాలపరిమితి లోపు పాలసీదారు చనిపోయినట్లయితే వారి కుటుంబానికి లేదా నామినీకి ప్రయోజనాలను అందజేస్తారు. బీమా అనేది ముఖ్యంగా రక్షణ కోసం అంతే కానీ దాన్ని పెట్టుబడిగా చూడలేం.
Complete life insurance policy – సంపూర్ణ జీవిత బీమా పాలసీ
కాలపరిమితితో ముగియకుండా జీవిత కాలం మొత్తానికి వర్తించే పాలసీయే సంపూర్ణ జీవిత బీమా పాలసీ. పాలసీదారు జీవితాంతం ఈ పాలసీ వర్తిస్తుంది. చాలా కంపెనీలు ప్రవేశపెట్టే ఈ పాలసీల్లో ప్రీమియం పాలసీ అమల్లో ఉన్నంత వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
Endowment Insurance policy – ఎండోమెంట్ పాలసీ
ఎండోమెంట్ పాలసీల్లో బీమా రక్షణతో పాటు పొదుపు కూడా ఉంటుంది. వీటిని బీమా కంపెనీ ముందే సూచించిన మెచ్యూరిటీ పీరియడ్‌తో ప్రవేశపెడతారు. పాలసీ ముగిసే లోపు అనుకోకుండా ఏదైనా జరిగి శాశ్వత వైకల్యం కలిగినా లేదా బీమాదారు మరణించినా బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. మామూలుగా అయితే పాలసీ ముగిసిన తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్‌ను చెల్లిస్తారు.
Money back Insurance policies – మనీ బ్యాక్ ప్లాన్లు
మనీ బ్యాక్ ప్లాన్లలో మెచ్యూరిటీకి ముందే నిర్ణీత కాలవ్యవధుల్లో మన డబ్బు కొంత శాతం తిరిగి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలపరిమితి ఉన్న పాలసీలో 5,10,15 ఏళ్లకు ఒకసారి చెల్లింపులు జరిపే వీలుండేలా ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పాలసీ కాలపరిమితి మొత్తానికి రిస్క్ కవరేజీ ఉంటుంది.
Insurance Policies for Children – పిల్లల పాలసీలు
పిల్లల పాలసీలు పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉండేలా వారు చిన్నగా ఉన్నప్పుడే వారి కోసం పాలసీలు తీసుకునేందుకు వీలుంది. ఈ ప్లాన్లన్నీ పిల్లల పేరిట లేదా తల్లిదండ్రుల పేరిట తీసుకోవచ్చు. 18 లేదా 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నుంచి పాలసీ ప్రయోజనాలను చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకునేందుకు పాలసీలు అవకాశం కల్పిస్తున్నాయి. పిల్లల పాలసీల్లో కాలపరిమితి ముందే పాలసీ ప్రీమియం కట్టే తల్లిదండ్రులు మరణిస్తే తదుపరి ప్రీమియంలను కట్టాల్సిన అవసరం లేకుండా బీమా కంపెనీలు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
Annuities – యాన్యుటీలు
యాన్యుటీలు పదవీ విరమణ తర్వాత పింఛను పొందాలనుకునే వారి కోసం రూపొందించినవే రిటైర్మెంట్ పెన్షన్ పాలసీ . సాధారణంగా 60 ఏళ్ల తర్వాత నుంచి పింఛను అందుకునేలా బీమా కంపెనీల పాలసీలు ఉంటున్నాయి. మన అవసరాన్ని బట్టి ఎన్ని నెలలకు ఒకసారి పింఛను కావాలో ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు కొంత వరకూ యాన్యుటీలు దోహదం చేస్తాయి.
Unit Linked Insurance Plan – యూలిప్‌లు
యూలిప్‌లు రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో ప్రవేశించేందుకు యూలిప్‌లు ఉపయోగపడతాయి. వినియోగదారుడి నష్టభయ సామర్థ్యాన్ని బట్టి యూలిప్ పెట్టుబడులను ఈక్విటీలో గానీ, డెట్ ఫండ్స్‌లో గానీ పెట్టుబడులుగా పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళిక కలిగి ఉండే వారి కోసం యూలిప్‌లు అనుకూలమైనవి. ఈ పాలసీలకు ప్రీమియాన్ని పాలసీదారు పెట్టుబడి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి వారే ఎంచుకోవచ్చు.
మీ అవగాహన కోసం కొంచెం సమాచారం ఇక్కడ పొందు పరచడం జరిగింది, పాలసీ తీసుకునే ముందు సంబంధిత వారిని కలిసి పూర్తి వివరంగా తెలుసుకుని పాలసీ తీసుకోవడం మంచిదని మనవి.