ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Aunty Kuthura Song Lyrics In Telugu – Bavagaru Bagunnara
ఆంటీ కూతురా… అమ్మో అప్సరా, ముస్తాబదిరింది
ఆంటీ కూతురా… అమ్మో అప్సరా, ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది… తధాస్తని పందిరన్నది
అంకుల్ పుత్రుడా… హలో అల్లుడా, వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నది… వెడ్డింగే సిద్ధమైనది
పెళ్ళిదాక చేరుకున్న అందాల… పిల్లగారు బాగున్నారు
భర్తలా మారనున్న బంగారు… బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారెవా… ముక్కు పుడక వారెవా
గళ్ళచొక్క వారెవా… కళ్ళజోడు వారెవా
ఆంటీ కూతురా… అమ్మో అప్సరా, ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది… తధాస్తని పందిరన్నది
ఆదివారం అర్ధరాత్రి వేళలో… ఆ అల్లరంత మరిచేదెట్టా
సోమవారం ఆడుకున్న ఆటలో… ఆ హాయికింక సరిలేదంట
వంట ఇంటి మధ్యలో… గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో… చెంపకెన్ని చుంబులో
ఎట్టాలెకెట్టిన పిట్ట నీ ఒంటిలో… పుట్టమచ్చలున్నవి ఏడు
ఇంకాస్త తీయవద్దు ఆనవాలు… ఇటువైపే చూడసాగే వేయికళ్ళు
ముద్దుమురిపాలు అంటే గిట్టనోళ్ళు… మునుముందు జన్మలోన కీటకాలు
ఆంటీ కూతురా… అమ్మో అప్సరా, ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది… తధాస్తని పందిరన్నది
ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో
నువ్వు కదిలితే… సాగదు కాలం
నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో
నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
గోల్డు చైను సాక్షిగ… ఎన్ని గోటిముద్దలో
హెయిర్పిన్ సాక్షిగా… ఎన్ని హాటు గుర్తులో
కైపే పుట్టించినా… చిట్టావోటుందిగా, కొండవీటి చాంతాండంత
పెళ్ళి కాలేదుగాని లక్షణంగా… పెళ్ళానికంటే నేను ఎక్కువేగా
ముళ్ళే పళ్ళేదుగాని శుభ్బరంగా… థ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగా
ఆంటీ కూతురా… అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది… తధాస్తని పందిరన్నది
పెళ్ళిదాక చేరుకున్న అందాల… పిల్లగారు బాగున్నారు
భర్తలా మారనున్న బంగారు… బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారెవా… ముక్కు పుడ్డక వారెవా
గళ్ళచొక్క వారెవా… కళ్ళజోడు వారెవా
ఆంటీ కూతురా… అమ్మో అప్సరా ముస్తాబదిరింది
ముహుర్తం ముందరున్నది… తధాస్తని పందిరన్నది