Menu Close

కనుమరుగవుతున్న చీరకట్టు – తప్పకుండా చదవండి

తర తరాలుగా ఊరూ వాడలకు చెక్కుచెదరని పేరు ప్రతిష్ఠలు తెచ్చి వన్నె చేకూరుస్తున్నది చీరే! అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు గజాల చీరను సృష్టించిన ఘనతా మనదే. భారతీయ మగువ ఆత్మ చీర. మగువకు నిండుదనాన్నిచ్చేదీ, అజంతా శిల్పంలాంటి ఆకృతినీ, అందాన్నీ సమకూర్చేదీ చీరకట్టే. 

చీరకట్టు ఎంతో గొప్ప లుక్ తెచ్చిపెడుతోందనడం ఎంత వాస్తవమో పాశ్చాత్య సంస్కృతి మోజులో నేడు మన చీరకట్టు వెల వెలబోతోందనడం కూడా అంతే వాస్తవం!
‘ఇది నా పుట్టింటి వారసత్వపు పట్టు చీర, ఇది నా పెళ్ళి పట్టు చీర, ఇది వ్రతం చీర, ఇది నా పెనిమిటి తెచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ చీర..’ అంటూ మరపురాని జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తుతెచ్చుకోని మగువంటూ మనలో ఉండనే ఉండదు. చీర పేరు చెబితే చాలు వారికి 
చీరకట్టులో 80 రకాలు.

telugu stories

చీర ఎటువంటి వాతావరణానికైనా అనువుగా, ఉంటుంది. చీరకట్టుకు కులం, ప్రాంతాలవారీగా ప్రత్యేక శైలి ఉంది. ఉత్తర భారతీయ స్త్రీలు పైటకొంగును ముందుకు వేసుకున్నా, దక్షిణభారత స్ర్తీ వెనకకు వేసుకున్నా, గోచీ కట్టినా ఆ చీరకట్టు ఆయా ప్రాంతాలకు ప్రత్యేకం. చీరకట్టులో మొత్తం 80 వైవిఽధ్యాలు ఉన్నాయి. దాదాపు 109 రకాలుగా చీరను వైవిధ్యంగా ఎలా కట్టుకోవచ్చో అంతర్జాల (ఇంటర్నెట్) మాధ్యమంలో నిపుణులు నిక్షిప్తం చేశారు. నార చీర మొదలు పట్టు చీర వరకూ దేని అందం దానిదే. దేని సోయగం దానిదే. పాశ్చాత్య నాగరికత మోజులో పడిన నేటి యువత చీరకట్టుకోవడం చేత కాదంటూ అమాయక ముఖం పెడుతోంది.

Beautiful Indian Women Photos


 

ప్రాంతీయ చీరలు నాలుగు

మన దేశంలో నాలుగు రకాల చీరల్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మధ్యభారతంలో చందేరి, మహేశ్వరి చీరలు, పడమటి ప్రాంతంలో బాందిని, పైతాని, పటోలా చీరలు, తూర్పు ప్రాంతంలో సంబాల్పూరి, జాందాని, బాలుచారి సిల్క్, దక్షిణ ప్రాంతంలో మైసూరు సిల్క్, కంచిపట్టు, చెట్టినాడు, పోచంపల్లి, గద్వాలు, ఉత్తర భారతంలో షాలు, టాంచోయ్, బెనారస్ పట్టు చీరలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. తమిళనాడు కాంచీపురం కంచి పట్టు చీరకు మూడో శతాబ్దం కాలం నుంచీ గుర్తింపు ఉంది. కాంచీపురంలో పల్లవుల కాలంనుంచి ఇంటింటా చీరలు నేసే కళాకారులుండేవారు. అక్కడి పాలార్, వేగావతి నదుల నీటిని మాత్రమే బ్లీచ్ చేయడానికి, చీర ఉతకడానికి వారు వాడతారు. ఈ నదుల్లో నీరు పట్టు చీరలకు సహజ మెరుపు ఇస్తుందంటారు కళాకారులు. 

Beautiful Indian Women Photos

‘గిన్నిస్’ కెక్కిన చీర

చేనేత చీరలకు ప్రసిద్ధి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. ఈ పట్టణంలో చేనేత నిపుణుడు నల్లా పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి 1990లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. యాభై గ్రాముల బరువుగల ఆరుగజాల పట్టు చీర నేసి అగ్గిపెట్టెలో ఇమిడ్చి చూపించారాయన. ఉంగరం దూరిపోగల చీర (1995)ను నేశారు. ఇలా మన చీర వైభవం గిన్నిస్ బుక్లో నమోదైంది. 

Beautiful Indian Women Photos

ఇలా ఆ‘కట్టు’కోండి
చీర పొడవులో అరగజం తగ్గినా..ప్రపంచ వస్త్రధారణలో చీర స్థానం ఎప్పటికీ పైమెట్టే. పాశ్చాత్యులు సైతం సలామ్ చేసే చీర ప్రతి కదలికలోనూ చూడచక్కనిదే. బంగారు తీగలతో నేసినా..వెండితీగలతో అల్లినా, నైలాన్ దారంతో నయనానందకరం చేసినా.. అందరినీ ఆకట్టుకునేది చీరకట్టు ఒక్కటే. అందుకే చక్కటి చీరకట్టుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే! 

1. పొడగరులైన స్ర్తీలు అడ్డగీతల చీరలు, నాజూకుగా ఉండే స్ర్తీలు నిలువు గీతలున్న చీరలు కట్టుకుంటే బాగుంటుంది.

2. చీర కట్టు ఎంత ముఖ్యమో మ్యాచింగ్ బ్లౌజ్ కూడా అంతే ముఖ్యం. లావుగా ఉన్న స్ర్తీలు శరీరానికి అతికినట్టుండే జాకెట్టు ధరిస్తే బాగుంటారు, సన్నగా ఉన్నవారు కొంత లూజుగా ఉండే బ్లౌజ్ ధరించాలి.

3. ఎప్పడూ కాలిమడిమలు కనిపించకుండా ఉండేలా చీర కుచ్చిళ్లు కట్టాలి. పల్లూ కూడా భుజం మీదుగా మోకాలు దాకా వచ్చేలా చూసుకోవాలి.

4. మొదటిసారి కట్టుకునేవారు సింథటిక్ చీర వాడితే మేలు!

రచన:  శేకర్ చంద్ర కామగిరి

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading