Menu Close

Annula Minnala Ammadi Lyrics in Telugu – Chanti

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Annula Minnala Ammadi Lyrics in Telugu – Chanti

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణీ

ఆ దేవుడు ఆ దేవితో అలక బూనెనేమో
ఈ రూపుగ శ్రీదేవిని ఇలకు పంపెనేమో
మోహనాల సోయగాల మేనకో
మరి దేవలోక పారిజాత మాలికో
రేకులు విచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి
నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి
విరబూసే పూబోనీ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణీ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

ఆ కలువలు ఈ కనులకు మారు రూపులేమో
ఆ నగవలు వేకువలకు మేలుకొలుపులేమో
పాల కడలి మీద తేలు చంద్రికో
గగనాల వేళ కాంతు లీను తారకో
వెన్నల్లే వస్తాడు ఓనాడు రాజుంటి గొప్పింటి మొగుడు
ఊరంతా సందెల్లు ఆనాడు వాడంతా వియ్యాల వారు
పిప్పి పీ పీ డుం డుం డుం

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే
సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే
శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే
అలివేనే ఈ రాణీ

అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే

Annula Minnala Ammadi Lyrics in Telugu – Chanti

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading