Menu Close

Annayyaa Annayyaa Song Lyrics In Telugu – peddanna


మాటే చాలు… మందుగుండు మందుగుండు
తూటాలేగా…. కళ్ళు రెండు కళ్ళు రెండు
అన్నగారి ఎంట్రీ ఇది… ఏసుకో విజిలు
అన్నగారి దెబ్బ చూడు… ఆనందాలు డబలు

ఆకాశాన్ని రెండు చేసే వేటకత్తి వీడు
వీడిలాంటి వీరుడింక చుట్టుపక్క లేడు

అన్నయ్యా అన్నయ్య అని
గుండెలోన పెట్టుకున్న అందరికి థాంక్సు
అన్నయ్యా అన్నయ్య అని
ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్సు

చేరువలో సత్తువ తెలియదురా
చేతలకు సంద్రమే మైదానం
ఎరకు ఈ తిమింగలం దొరకదురా
పెంచుదాం కలలకు పరిమాణం

చెమట తడి నీరై పోదు
జగతి జయించుదాం
జరగనిది లేనే లేదు
గగనం వంచుదాం

అన్నయ్య మాటలే స్టైలు
అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే
ఉల్లాస కల్లోలమే, ఏ ఏ ఏ

అన్నయ్య మాటలే స్టైలు
అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే
ఉల్లాస కల్లోలమే, ఏ ఏ ఏ

అన్నయ్యా అన్నయ్య అని
గుండెలోన పెట్టుకున్న అందరికి థాంక్సు

మూడు ముద్దలందు నోటి ముద్దకంటు
లోటు లేని అన్నపూర్ణ లాంటి ఊరు
అంతమంచి ఆకుపచ్చ సీమలోన
పుట్టినట్టి కోహినూరు అన్నగారు

పేరు గొప్ప పెద్ద మనసువాడు… అందలాన ఇంద్రుడు
వీసమెత్తు నలుపు లేనే లేని… చల్లనైన చంద్రుడు
మాట ఇస్తే దాటిపోడు… మోసగిస్తే ఊరుకోడు
నమ్మినోళ్ళ కొమ్ముగాసే… నాయకుడు వీడు

కదిలే కాలమో అద్భుతం
దాని విలువను కాస్త గమనించుకో
గాలం వేయు పేరాశను
ఒక దణ్ణం పెట్టి వదిలించుకో

ఓ, మనసులు గెలుచు గుణమేదిరా
బదులిక అనక ప్రేమించడం
తరగని సౌర్య ధనమేదిరా
శత్రువునైనా కరుణించడం
లక్ష్యమేగా ప్రాణం ధ్యానం
ఎక్కుపెట్టు బాణం
కష్టమేగా అదృష్టంగా అందే బహుమానం

పిడికిలి బిగువన పిడుగొకటుందిరా
బెదిరిపోరాదు నీ సరుకు
మనకొక రోజని రాసిపెట్టి ఉందిరా
ఓడిపోరాదు కడ వరకు

అన్నయ్య మాటలే స్టైలు… అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే… ఉల్లాస కల్లోలమే, ఆ హ్హా హ్హా
అన్నయ్య మాటలే స్టైలు… అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే… ఉల్లాస కల్లోలమే

అన్నయ్యా అన్నయ్య అని
గుండెలోన పెట్టుకున్న అందరికి థాంక్సు
అన్నయ్యా అన్నయ్య అని
ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్సు

అన్నయ్య మాసుకే మాసు… అన్నయ్య వాకింగే గ్రేసు
అన్నయ్య స్టామినా… బిందాసు భీభత్సమే
అన్నయ్య మాసుకే మాసు… అన్నయ్య వాకింగే గ్రేసు
అన్నయ్య స్టామినా… బిందాసు భీభత్సమే, ఆ హ్హా హా

Like and Share
+1
0
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading