Menu Close

అన్న క్యాంటీన్లు స్వాతంత్ర దినోత్సవం రోజు నుండి మొదలు


Anna Canteens all set to reopen in Andhra Pradesh on Independence Day

అన్న క్యాంటీన్ మెనూ. ఇక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందుబాటులో ఉంచుతారు. వారంలో ఆరు రోజులు ఈ క్యాంటీన్లు నడుస్తాయి. ఆదివారం మాత్రం సెలవు దినం.

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
Anna Canteens all set to reopen in Andhra Pradesh on Independence Day

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న (గురువారం) అన్న క్యాంటీన్‌ను కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు.

ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేయనున్నారు. మిగిలిన వాటికి ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు 5న ప్రారంభించనున్నారు.

ఇవి పేదవాళ్ళకి చాలా అవసరమైనది. ఆటో వాల్లనే తీసుకుంటే రోజుకి 100 నుండి 200 వరకు వారి ఆహారనికి బయట కర్చు పెడతారు. ఈ అన్నా క్యాంటీన్ల వల్ల వారికి నెలకి దాదాపుగా 3 నుండి 5 వేల వరకు మిగలనున్నాయి.

బ్రేక్ ఫాస్ట్ రూ.5
లంచ్/డిన్నర్ రూ.5

సోమవారం, గురువారం మెనూ
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా
లంచ్/డిన్నర్ రూ.5
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి

మంగళవారం, శుక్రవారం మెనూ
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి

బుధవారం, శనివారం మెనూ
బ్రేక్ ఫాస్ట్
ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్
లంచ్/డిన్నర్
వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి

బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
లంచ్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది.
డిన్నర్ రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది.

ఇడ్లీ, పూరి-3, ఉప్మా, పొంగల్-250 గ్రాములు, వైట్ రైస్ – 400 గ్రాములు, చట్నీ/పొడి – 15 గ్రాములు, సాంబారు- 150 గ్రాములు, మిక్చర్ – 25 గ్రాములు, కూర – 100 గ్రాములు, పప్పు/సాంబారు – 120 గ్రాములు, పెరుగు- 75 గ్రాములు అందిస్తారు.

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Articles

Subscribe for latest updates

Loading