ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Anjali Anjali Pushpaanjali Lyrics In Telugu – Duet
లాలలా లాలలా లాలాల లాల… లాలలా లాలలా లాలాల లాల
లల లల్ల లల్ల లల్ల లల్ల లాలలా………
అంజలీ అంజలీ పుష్పాంజలి… అంజలీ అంజలీ పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి… ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి… కనరాని నగవులకు కవితాంజలి

నిన్న దాక నువ్వూ నేను… ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా… తెలిపెను ఒకటని
కడలిని పడువానలా… కలిసిన మది ఇది
కరిగిన సిరిమోజుల… కథ ఇది నా చెలి
ఎదురుగ తొలిస్వప్నం తొణికినది… ఎదలో మదుకావ్యం పలికినది
అంజలీ అంజలీ వలపుల నా చెలీ…
పువ్వంటి పదములకు పుష్పాంజలి… ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి… కనరాని నగవులకు కవితాంజలి
అంజలీ అంజలీ పుష్పాంజలి… అంజలీ అంజలీ పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి… ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి… కనరాని నగవులకు కవితాంజలి
కన్నుల సంకేతమే… కలలకు తొలకరి
వెన్నెల జలపాతమే… వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే… కురిసినదెందుకో
కోయిలపాటే ఇలా… పలికినవెందుకో
చెలువుగ ఎదమారే… మధువనిగా
అమావాస్య నిశి మారే వెన్నెలగా…
అంజలీ అంజలీ ఇది హృదయాంజలి…
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి… నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి… కవియైన నీ మదికి కవితాంజలి
అంజలీ అంజలీ పుష్పాంజలి… అంజలీ అంజలీ పుష్పాంజలి
పువ్వంటి పదములకు పుష్పాంజలి… ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి… కనరాని నగవులకు కవితాంజలి
అంజలీ నీ చూపులో… వెన్నెల వెల్లువే
అంజలీ నా ఊపిరై… పలికెను పల్లవె
కన్నుల నువు లేనిదే… కలలే రావులే
నా మది నువు లేనిదే… కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని… మోజుకు నెలవైన వలపువని
అంజలీ అంజలీ వలపుల నా చెలి…