అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
మేఘాల్లో సన్నాయిరాగం మోగింది
మేలాలు తాళాలు వినరండి
సిరికీ శ్రీహరికీ కళ్యాణం కానుంది
శ్రీరస్తు శుభమస్తు అనరండి
అచ్చ తెలుగింట్లో… పెళ్ళికి అర్ధం చెపుతారంటు
మెచ్చదగు ముచ్చట ఇదే అని సాక్ష్యం చెబుతామంటు
జనులంతా జై కొట్టేల జరిపిస్తామండి
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని… చెయ్యందుకోవటే ఓ రమణీ
ఇంతవరకెన్నో చూసాం అనుకుంటే సరిపోదుగ
ఎంత బరువంటే మోసేదాక తెలియదుగా
ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగ
కాస్తైన కంగారు ఉంటుందిగా
నీకైతే సహజం తీయని బరువై సొగసిచ్చే బిడియం
పనులెన్నో పెట్టి మా తలలు వంచిందే ఈ సమయం
మగాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం
ఘనవిజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని… చెయ్యందుకోవటే ఓ రమణీ
రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక
రాజహంసలతో పంపి ఆహ్వానించంగా
కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగ
ఏ మాత్రం ఏ చోట రాజీ పడలేక
చుట్టాలందరికి ఆనందంతో కల్లు చెమర్చేలా
గిట్టని వాల్లయినా ఆశ్చర్యంతో కనులను విచ్చేల
కలల్లోనైనా కన్నామ కథలైన విన్నామ
ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా
అందాల కుందనపు బొమ్మవని
జత చేరుకున్న ఆ చందురుని
వందేళ్ల బంధమై అల్లుకుని… చెయ్యందుకోవటె ఓ రమణీ