Menu Close

Anandamanandamaye Song Lyrics In Telugu – Subhakankshalu

Anandamanandamaye Song Lyrics In Telugu – Subhakankshalu

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ… గానమే గాలిలాగ తాకనీ
నీ స్వరం నాదిగా… ఈ క్షణం పలికెనని

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే

నువ్వు నడచు దారుల్లో… పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితే గుండెల్లో… కొత్త సడిని వింటున్నా
నీలికళ్ళ ముంగిట్లో… నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో… తోరణంగా నేనున్నా
నీవైపే సాగే అడుగే… నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే… నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో… ఊపిరిపాటై పాడగా

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే

రాగమాల రమ్మంటూ… స్వాగతాలు పలికిందీ
ఆగలేని వేగంలో… ఆశ అడుగు వేసిందీ
జతగ నీవు చేరాకే… బ్రతుకు తీపి తెలిసిందీ
రెప్పచాటు లోకంలో… కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి… నీ కోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి… ఈ గీతం కానుక చేసి
శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో

Winter Needs - Hoodies - Buy Now

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ… గానమే గాలిలాగ తాకనీ
నీ స్వరం నాదిగా… ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading