ఆనందా పరమానందా పరమానందా
ఆనందా పరమానందా పరమానందా
జగతి నీవే జన్మ నీవే జగదానందా
ఆట నీవే పాట నీవే ఆత్మానందా
ఆనందా పరమానందా పరమానందా
మాయల వలలోన… జీవుల బంధించి
మురియుట ఒక ఆట ధర్మానందా
ఎదలో గరళాన్ని మధుర సుధగ మార్చి
నవ్వించుటొక ఆట మోహానందా
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ప్రాణ దాత బ్రహ్మ రాత నీ మాయేరా
ఆది నీదే అంతు నీదే అమరానందా
ఆనందా పరమానందా పరమానందా
గంగను తల దాల్చి ధరణికి మరలించి
స్వర్గంగ మార్చావు మధురానందా
పుత్రున్ని కరుణించి పున్నామ నరకాన్ని
లేకుండ చేస్తావు స్వర్గానందా
దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
దానాధర్మాల ఫలితాలే పసివాళ్ళు
కన్న వాళ్ళ కర్మలేరా పుణ్యానందా
కర్త నువ్వే కర్మ నువ్వే కరుణానందా
ఆనందా పరమానందా పరమానందా
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.