ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Amrutham Kurisina Rathri Song Lyrics In Telugu – Evandi Pelli Chesukondi
అమృతం కురిసిన రాత్రి… అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
సందెలో చలి సావిత్రి… సందెకే రస గాయత్రి
మురళిలా పెదవితో కలిసిపోనీ ప్రియా
అస్టపది అందాలందుకో, ఓ ఓ… ఇష్టపడి ఈలే వేసుకో, ఓ ఓ
గుచ్చకు గుచ్ఛకు గుమ్ముగా కసి తుమ్మెద
అధరాలుగారి అందమంత మరిగిన
లేతసోకు పూతరేకు రసనల ఆకతాయి తాకిడీల తపనలతో
అమృతం కురిసిన రాత్రి… అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
కసికసి వయసుల పసి మనసుల వల పిసిరిన వరసలలో
ఆఆ, పెదవులు కలిపిన వలపుల పిలువని పిలుపుల చలి చిలకల కలలో
రెప్పచాటు చుపులెన్నడో… తాను చెప్పలేని బాసలాయలే
కంటిలోని రూపమెన్నడో… కన్నె గుండెలోన దీపమాయెలే
నిన్న మాయలే… నేడు హాయిలే
కొసరి కొసరి జత కోటి కోరికలు మీటి పాడు వేళా
అమృతం కురిసిన రాత్రి… అతనితో కలిసిన రాత్రి
వలపులా వరదలో తడిసిపోనీ ప్రియా
ముగిసిన గతముల ముసిముసి నగవుల విరిసిన మమతలలో
ఆ ఆ, తనువుల బిగువులు తగిలిన తపనలు రగిలిన చెలి అలకల కలలో
నేలమీద వాన విల్లులే… నేను వేసుకున్న రంగవల్లులే
నవ్వులన్ని పూల జల్లులే… పాలు పొంగుకున్న పంట చేనులే
నేను నీవులే… మనకు లేవులే
తెలిసి తెలిపి తెలుగింటి ప్రేమలకు వంతపాడు వేళ