ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అమ్మా అని కొత్తగా… మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే… మళ్ళీ మొదలవ్వనీ
నింగీ నేలా… నిలిచేదాకా తోడుగా
వీచే గాలి… వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా… నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా…
అమ్మా అని కొత్తగా… మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే… మళ్ళీ మొదలవ్వనీ
నిదురలో నీ కల చూసి… తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ… జోల పాటవై
ఆకలని అడగక ముందే… నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ… జాబిలమ్మవై
నింగీ నేలా… నిలిచేదాకా తోడుగా
వీచే గాలి… వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా… నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా…
చిన్ని చిన్ని తగవులె మాకు… లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన… పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు… కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు… వేకువున్నదా
నింగీ నేలా… నిలిచేదాకా తోడుగా
వీచే గాలి… వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా… నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా…
నీకు పసిపాపలమేగ… ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మా జతలోనే… ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా… అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ… కొత్త జన్మ నివ్వడా
నింగీ నేలా… నిలిచేదాకా తోడుగా
వీచే గాలి… వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా… నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా…