అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Ambedkar Jayanti Telugu Wishes – Ambedkar Telugu Quotes 30

మితిమీరిన స్వేచ్చ సమానాత్వాన్ని హరించివేస్తుంది.
ఆత్మ విశ్వాసంతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుదాం. మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.
మనం ఎంచుకున్న మార్గం వెంట జంకులేకుండా ముందుకు సాగిపోవాలి
విద్య కంటే శీలం గొప్పది.

వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం.
ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండటం, దానిని చేరుకోవడానికై ఓపికగా పరిశ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి
ధేయం పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు కార్యాన్ని ముందుకు నడిపిస్తారు.

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకోసం దేవుని మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు.
ఒక గొప్ప వ్యక్తికి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకై సిద్ధంగా ఉంటాడు.
దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి

ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు
గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు, స్వయంసేవ ఉత్తమమైనది
ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం
సామాజిక చింతనకు ధర్మమే ఆధారం
ధర్మపాలితమైన సమాజం కోసం సంస్థాగతమైన వ్యవస్థలు సమాజంలో నిర్మాణం కావాలి
నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది.

మూడ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను నమ్మకూడదు.
సమాజం చైతన్యవంతం కావాలంటే, కాలానుగుణంగా సాగిపోవాలి.
కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని, నీతిని నిర్మించలేం.
నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు
ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం.
జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య..
మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే..

దేశానికి గాని, జాతికి గాని సంఖ్యా బలం ఒక్కటే సరిపోదు, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది. ఎవ్వరినీ నీచంగా చూడకండి.
ఎవరో వేసిన సంకెళ్లని వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే, మనమే సత్తా పెంచుకుని వాటిని ఛేదించడం మంచిది.
మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు. కాబట్టి పులుల్లా బతకండి.
జీవించేందుకు మనిషి తినాలి. సమాజ సంక్షేమం కోసం జీవించాలి.
Ambedkar Jayanti Telugu Wishes – Ambedkar Jayanto Telugu Quotes – Ambedkar Jayanti Telugu Greetings – Ambedkar Telugu Quotations – అంబేద్కర్ సూక్తులు